1996 వరకు మన ఊర్లో ప్రభుత్వ పాలకేంద్రానిదే హవా,అప్పటికి ఇంకా ప్రైవేటు డైరీలు లేవు. ఆ తర్వాత హార్లిక్స్ కొరకు పాలు అని ఓ కొత్త పాలకేంద్రం వెలసింది. ఇప్పుడు ఇంకా రెండు మూడు వచ్చాయనుకోండి. సరే ఇదంతా పాల కేంద్రాల విషయం. పదేళ్ళ క్రితం వరకు పొద్దున్నే ఏడుగంటలకి, సాయంత్రం ఏడుగంటలకి,1969 మోడల్ బెంజి లారీ తనదైన స్టైల్ లో హారన్ కొట్టుకుంటూ ఊర్లో ప్రవేశించేది. జనాలెవరూ తమ మెదడుకి పెద్ద మేత పెట్టకుండానే ఆ కూత దేనిదో ఇట్టే కనిపెట్టేసేవారు.
యు వి వర్లు అనే పేరు మొట్ట మొదటిసారి విన్న సందర్భం నాకు ఇంకా గుర్తుంది. హైస్కూల్ లో చదువుకునేటప్పుడు ఏదో కార్యక్రమం నిమిత్తం ఆయన అతిధిగా వస్తారు అని. కానీ ఆ కార్యక్రమంలో నేను లేకపోవటం వల్లో ఏమో కానీ అప్పుడు ఆయనని చూడలేకపోయా. విన్నప్పుడు ఏంటి ఈ పేరు ఇలా ఉంది అనే సందేహం వచ్చి చూస్తే పూర్తి పేరుని అలా కట్ చేసి పిలుస్తున్నారని అర్ధం అయ్యింది. అయినా చక్కగా వెంకటేశ్వర్లు అనే పేరుని అలా కుదించటం ఎందుకో అప్పుడు నా చిన్ని బుర్రకి తట్టలేదు.
నా జీవితంలో అతి త్వరగా ప్రవేశించి అంతే త్వరగా నిష్క్రమించిన వ్యక్తులు వీళ్ళు. ఎదిగీ ఎదగని వయసులో ఆలోచనా విధానం అప్పుడప్పుడే పరిణతి చెందుతున్న దశలో నేనెక్కువ కాలం గడిపిన వ్యక్తి వేమూరి వెంకట కృష్ణయ్య తాత. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పటినుంచి ఇంటర్మీడియట్ అయ్యే వరకు మధ్య లో ఒక్క సంవత్సరం తప్ప ప్రతిరోజూ అయన చెప్పే కబుర్లు వినకుండా పడుకున్న సందర్భాలు తక్కువ. మన పూర్వీకుల మీద, గ్రామ చరిత్ర మీద ఆయనకున్న అవగాహన అమోఘం.
మన ఊర్లో రాజకీయం చాలా విచిత్రమైనది అని చాలా మంది చెప్పటం విన్నాను తప్ప నాకు ప్రత్యక్షానుభవం లేదు. పార్టీ పరమైన విభేదాల వల్ల చాలా పనులు అవ్వలేదు.లేదా అనుకున్నంత బాగా చెయ్యలేకపోతున్నాం అని కొంతమంది పెద్దలు వాపోవటం విన్నాను. ఎదురు పడితే ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే చాలా మంది, పార్టీ విషయం వచ్చేటప్పటికి మాత్రం ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఎదుటి పార్టీ వారిపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి చూస్తుంటారు అనేది గ్రామం లో నానుడి.
అప్పుడే రెండేళ్ళు గడచిపోయాయి. అధికారికంగా వెబ్ సైట్ ని ఆవిష్కరించి రెండేళ్ళే అయినా, దీనికి పునాది పడి మూడేళ్ళు. దాదాపు సంవత్సరం పాటు సమాచార సేకరణకే వెచ్చించాల్సి వచ్చింది. ఏదైనా పక్కా ప్రణాళికతో, వ్యూహంతోనే రంగంలోకి దిగాలనేది నా అభిమతం. ఈ ప్రయాణంలో నాతో నడచిన మిత్రులు, సలహా దారులు లేకపోతే ఈ ప్రయాణం అసంపూర్ణంగానే ముగిసిపోయేదేమో. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పడిన కష్టం కనిపిస్తోంది తప్ప, రూపకల్పన చేసేటప్పుడు మాత్రం ఏనాడు కష్టమనిపించలేదు. ఏదో గొప్ప ఆశయం కోసమో, ఊరుని ఉద్ధరించేయాలి అనే ఆరాటంతో ఈ సైట్ పెట్టలేదు.
Home | About Us | Mana charitra | Village Info | NRI Cell | Agriculture | Our Team | Site Map | Contact us |
||
| Copyright © 2009 managhantasala.net. All rights Reserved. |







