Editor Voice

  • నేనెరిగిన 'మండలి'

     రాజకీయ నాయకుల ప్రసంగాలని కేవలం ఎన్నికల ప్రచార సమయంలోనో లేక టి.వి లో స్టేట్మెంట్ల రూపం లోనో తప్ప సాహితీ చర్చల్లో, తెలుగు భాష పరిరక్షణా వేదికలపై వినటం కద్దు. మొట్ట మొదటి సారి ఆ ప్రసంగాన్ని విన్న సందర్భం గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారి జీవిత చరిత్ర నా జీవన నౌక పుస్తక ఆవిష్కరణ సమయంలో శాసన మండలి జూబ్లి హాలులో. మండలి బుద్ధ ప్రసాద్ గారిని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా లేదా ఒక రాజకీయ నాయకుడిగా నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. నాకు, ఈ సైట్ కి సంభంధించినంత వరకు అది అనవసరం, అప్రస్తుతం. 

    . ...readmore

  • లాల్ సలాం

     కమ్మ,రెడ్డి కలిస్తే కామ్రేడ్ అని ఒక కమ్మాయన చెప్పినప్పుడు, నిజమే కదా అనుకున్నా. బడుగు వర్గాల కోసం పాటుబడే కమ్యునిష్టు నాయకులు రెండు అగ్రకులాలకి చెందిన వారే అవ్వటం మన రాష్ట్రం లో ఉన్న పెద్ద వింత. వారసత్వ రాజకీయాలు లేని, వారసులు ఏ మాత్రం రాజకీయాల్లోకి రావటానికి ఆసక్తి కనబరచని ఏకైన పార్టీ ఉందంటే అది  కమ్యునిష్టు పార్టీలే. ఒకప్పుడు మన ఊరు నిడుమోలు నియోజక వర్గం లో ఉండేదనే విషయం చాలా మందికి తెలిసిందే. చిన్నప్పుడు జరిగిన రెండు మూడు ఎలక్షన్లు నాకు బాగా గుర్తు. ఎప్పుడు చూసినా మన నియోజకవర్గానికి పాటూరి రామయ్య కమ్యునిష్టు పార్టీ తరపున పోటీ చేసేవారు. అది సి.పి.ఐ లేక సి.పి.ఎమ్ పార్టీ నో గుర్తు లేదు. కత్తి, సుత్తి, కొడవలికే మీ ఓటు అంటూ ప్రచారం జరుగుతూ ఉండేది. 

    . ...readmore

  • పరిమళించని పాట

     వేటూరి పాటంటే నాకు చాలా ఇష్టం, మబ్బుల్లో నీళ్ళకోసం ఉన్న ముంతలో నీళ్ళు వంపేస్తారు అని మధ్య తరగతి మనస్తత్వాలని గేలి చేస్తూ నిరాశ వాదం వైపు నడిపిస్తున్న సాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లోనే, నింగి నైనా కిందకి దించగల సత్తా ఉన్నపుడు, మన చేతిలో ఉన్ననీళ్ళు వంపేసినా తప్పులేదు ....అనే ప్రతివాదం తో ఆశావాదాన్ని, స్ఫూర్తిని రగిలించిన సాహితీ మూర్తి వేటూరి. అయన సాహిత్యంలో ఆ  మాట నా జీవితానికి టాగ్ లైన్. ఆ ఒక్క మాటని అనుసరించటమే నా జీవితంలో ప్రతి మెట్టుకి సోపానంగా నిలిచింది. అది అనుసరిస్తున్నపుడు, నేను దుబారా గా ఖర్చుపెడతానని, రేపటి గురించి దాచుకోనని కుటుంబ సభ్యులు,బంధువులు నా మీద స్టాంప్ వేసేసినా, నేను నమ్మిన వేటూరి తత్వాన్ని వదులుకోలేదు. చివరికి నా ఆలోచనే కరెక్ట్ అని నన్ను అన్నవాళ్ళకి అర్ధం అయ్యింది.

    . ...readmore

  • సత్ర విచిత్రం

     నేను ఇరవై ఏళ్ళు ఊర్లో పెరిగినా ఇప్పటికీ ఒక్కసారి కూడా చూడని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.దూరపు కొండలు నునుపు అని, ఎక్కడెక్కడో ఉండే చారిత్రక ప్రదేశాలని చూడటానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళతాం. కానీ మనం పుట్టిన ఊరులో ఉన్న చారిత్రక ప్రదేశాలని మాత్రం విస్మరిస్తూ ఉంటాం.చిన్నపట్నుంచి కొన్ని వేల సార్లు సత్రం సెంటర్ అనే పదాన్ని ఉపయోగించి ఉంటాం. కానీ నేను ఖచ్చితం గా చెప్పగలను,ఈ కధనం చదువుతున్న వాళ్ళలో నూటికి తొంభైమంది సత్రం మాత్రం చూసి ఉండరు.

    . ...readmore

  • అసమర్ధుడి సంపాదకీయం

     ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతుండగా ఓ వ్యక్తి అటుగా వచ్చి చూస్తున్నాడు.అతడు చెక్కుతున్న శిల్పం లాంటిదే మరోటి పక్కన ఉండటం చూసి ఆ శిల్పిని అడిగాడు. మళ్లీ అలాంటి శిల్పమే చెక్కుతున్నావేమిటి అని. దానికా శిల్పి బదులిస్తూ అందులో చిన్న లోపం ఉండిపోయింది అందుకే మరోటి చెక్కుతున్నాను అని. ఆ వ్యక్తి ఆ శిల్పాన్ని మళ్లీ పరీక్షగా చూసాడు తనకి అందులో లోపం ఏమిటో కనపడలేదు. మళ్లీ శిల్పిని అడిగాడు ఇందులో లోపం ఏమి లేదుగా అని. ముక్కు దగ్గర కొద్దిగా తేడా ఉంది అని చెప్పాడు.

    . ...readmore

  • స్మశాన వైరాగ్యం

     మృత్యువు. ఈ పదం అంటే మనలో భయం లేనిదెవరికి? ఈ చావును తప్పించుకోవటానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఒక మనిషి బతకడని తెలిసిన తరువాత కూడా చివరి క్షణం వరకూ అతణ్ణి బతికించటం కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడం.. మనకు చావంటే అంత భయం. మరి చనిపోయిన తర్వాత??? ప్రతి మనిషి వెళ్ళాల్సిన చోటు ఒక్కటే. స్మశానం అతి పవిత్రం.. ఈశ్వరుడు  తాను దగ్గరుండి జీవులను తనలో ఐక్యం చేసుకునే స్మశానం.. ఏమిటీ స్మశానం ప్రత్యేకత?

    . ...readmore

  • తియ్యటి మనిషి

     హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో మా బంధువు ఒకాయన నన్ను స్కూటర్ పై తీసుకు వెళుతూ ఒక ఇల్లు చూపించి ఇది మీ ఊరు వాళ్ళదే అని చెప్పారు. ఎవరిదీ అని అడిగా,వెంకట్రాయులు గారిది అని చెప్పారు.ఓహొ ఆయన  ఇప్పుడు లేరు కదా  అని చెప్తే, ఎందుకు లేరు? లక్షణంగా ఉన్నారు,భార్య భర్తలిద్దరూ ఇక్కడే ఉంటారు అని చెప్పారు.ఈ సంఘటన జరిగింది 1999 లో.మన గ్రామంలో రంగనాధ బాబు గారు స్థాపించిన గొర్రెపాటి వెంకట్రాయులు ఉదయభాస్కరమ్మ విద్యా ట్రస్ట్ గురించి వినటమే కానీ అంత లోతుగా వారి వివరాలు అప్పటికి తెలియదు.

    . ...readmore

  • ఆరంభ శూరత్వం

     ఎవరికైనా మంచి ఉద్యోగం వస్తే ముందుగా వాళ్లకి కంగ్రాట్స్ చెప్తాం. ఆ తరువాత తీరుబడి గా మిగతా విషయాలన్నీ తెలుసుకుంటాం. కానీ నాకీ మధ్య కొన్ని ఆశ్చర్య కరమైన అనుభవాలు ఎదురయ్యాయి. గత ముప్పై ఎనిమిది వారాలుగా ఎడిటర్ వాయిస్ రాస్తున్నా.ఈ మధ్య నాకు పోలాండ్ లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం రావటంతో ఆ సంతోషాన్ని సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పంచుకున్నాను. అది అలా అలా అందరికి తెలిసి కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగిన మొదటి ప్రశ్న, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే వెబ్ సైట్ పరిస్థితేంటి? 

    . ...readmore

  •  “The greatness of a nation and its moral progress can be judged by the way its animals are treated" దేశం యొక్క గొప్పతనం, నైతిక విలువలు ఆ దేశంలో జంతువుల్ని,మూగజీవాలని పరిరక్షించే విధానాల ద్వారా తెలుస్తాయని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తి మన గ్రామం లో పశువుల ఆస్పత్రి లో కనిపిస్తుంది.మనం పట్టించుకోని చాలా ముఖ్యమైన విభాగాల్లో పశువుల ఆసుపత్రి ఒకటి. మనుషులకి నోరుంది, మన భాధని డాక్టర్ కి చెప్పుకోవటానికి ఆ భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ భాధని విని తగిన వైద్యం చేసే అవకాశం డాక్టర్లకి ఉంది.

    . ...readmore

  • శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారు

     

    శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారు

    ఘంటసాల గ్రామానికి చెందిన వ్యక్తి కాకపోయినా,ఘంటసాల గ్రామంతో రాజకీయంగానూ వ్యక్తిగతం గానూ విడదీయలేని అనుభంధం ఉన్న వ్యక్తి వేమూరి వెంకట కృష్ణారావు గారు. నేను ఆరవ తరగతి హైస్కూల్ లో చదువుకునేటప్పుడు స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి గా వచ్చారు. ఆ సంవత్సరం నాకు ఇంగ్లిష్ లో ఫస్ట్ ప్రైజ్ రావటం తో ఆయన చేతులమీదుగా ఆ బహుమతిని అందుకున్న జ్ఞాపకాలు నాకున్నాయి.
    . ...readmore

  • మాది కొడాలి

     అవి నేను మొవ్వ గ్రామంలో ఇంటర్ చదువుతున్న రోజులు. మన గ్రామం నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్ధులు అక్కడ చదువుకోవటానికి వచ్చేవారు. అప్పటిదాకా సొంత గ్రామం లోని స్నేహితులతో చదువుకున్న మాలాంటి వాళ్లకి వేరే గ్రామాల విధ్యార్ధులతో కలిసి చదువుకోవటం అదే మొదటి సారి. స్కూల్ దశ నుంచి కాలేజి జీవితం లోకి వేసిన తొలి అడుగు ఇంటర్ కాలేజికే. ఒక రోజు మాథ్స్ క్లాస్ జరుగుతుంటే వెనక ఏదో చిన్నగా ఇద్దరు విద్యార్ధుల మధ్య గొడవ అయింది. 

    . ...readmore