"భూ" కైలాస్

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

వైభవంగా విగ్రహ ప్రతిష్ట

వైభవంగా విగ్రహ ప్రతిష్ట

నందమూరి జ్ఞాపకాలు

నందమూరి జ్ఞాపకాలు

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

e-Books Pages

 మధురజీవి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి జీవిత విశేషాలతో వారి ఆప్తుడు శ్రీ వేగుంట కనక రామ బ్రహ్మం గారు రాసిన గ్రంధం.చరిత్ర ని వెలుగులోకి తీసుకురావటానికి ఆయన పడిన తపన,రచనల సమయంలో ఆయన పాటించిన  ప్రామాణికాలు,అడుగడుగనా ఈ గ్రంధం లో కనిపిస్తాయి.మధుర జీవనం అంతే ఎంతో సరైన అర్ధం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన  గ్రంధం.

 

 గొర్రెపాటి మహాలక్ష్మమ్మ గారు,మన గ్రామంలోనే కాక ఆనాటి అభ్యుదయ రచయిత్రులలో పేరెన్నికగన్న రచయిత్రి.చరిత్రకారుడిగా వ్యక్తుల జీవిత చరిత్రలను రాయటం లో వెంకట సుబ్బయ్య గారు సిద్ధహస్తులైతే, స్త్రీ వాద రచనలలో  మహాలక్ష్మమ్మ గారు దిట్ట.

 

గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాసిన అన్ని గ్రంధాలను అవలోకించుకుంటూ తన 80 ఏళ్ల వయసులో రాయలేని స్థితి లో ఉన్నా తన సాహితీ వ్యాసంగాన్ని ఆపలేదు. తుది శ్వాస వరకు రచనలే ప్రపంచం గా బ్రతికారు. పండిత వెంకట సుబ్బయ్య, కవి వెంకట సుబ్బయ్య, ఎర్ర వెంకట సుబ్బయ్య, మధుర జీవి, ఎంతో ఆప్యాయం గా  పిలిపించుకున్న ఆ చరిత్ర కారుని మరో అమూల్య గ్రంధం నా సాహిత్య కృషి. 01.11.1978 న ముందుమాట రాసిన ఈ గ్రంధం సరిగ్గా 33 సంవత్సరాల తర్వాత 01.11.2011 న  e-book గా రూపొందటం ఆయనకి మనమిచ్చే అరుదైన గౌరవం గా భావిద్దాం.

 

 

ఇప్పటివరకు తనతో జీవితాంతం నడచి ,తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న సహధర్మ చారిణి కి తమ రచనలని అంకితమిచ్చిన రచయితలున్నారు.కానీ ప్రపంచం లో ఏ రచయితా తన భార్య గురించి ఒక గ్రంధం రాసిన దాఖలాలు లేవేమో...భార్య అంటే ఒక బానిస ,ఒక వంట మనిషి ,భార్య భర్తల సంభందం అంటే యజమాని , సేవక సంభందం అనే బూజు పట్టిన భావాలున్న దశకాల్లో జీవించిన అపురూపమైన దంపతుల కధ ఇది. అంతిమ క్షణాల్లో భార్య తో తాను గడిపిన క్షణాల్ని , ఆమెకివ్వలేకపోయిన చిన్న చిన్న ఆనందాల్ని తలుచుకుంటూ ఆమె స్మృతి తో ఆమె కోసమే రాసిన స్మృతి చిహ్నం ఈ గ్రంధం.

 

  ఘంటసాల చరిత్ర - 2011 పుస్తక ప్రతులకు సంప్రదించండి.

     info@managhantasala.net
 
ఇండియా లో అన్ని ప్రాంతాలకు వెల : 150 /- 
కొరియర్ ఛార్జీలు అదనం.

విదేశాలకు : 10 $ USD
కొరియర్ ఛార్జీలు అదనం

ఈ పుస్తకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని,తెరమరుగవుతున్న మరి కొన్ని పుస్తకాల పునర్ముద్రణ కి వినియోగించటం జరుగుతుంది.
గ్రామ చరిత్ర పరిరక్షణ ఉద్యమం లో మీరు కూడా భాగస్తులు అవ్వండి.
 
 

ఆనాటి జమిందారి వ్యవస్థ పై పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాసిన గ్రంధం....