ఆకాశానికి ఆధారం

ఆకాశానికి ఆధారం

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

బాలకృష్ణ పర్యటన విజయవంతం

బాలకృష్ణ పర్యటన విజయవంతం

నందమూరి జ్ఞాపకాలు

నందమూరి జ్ఞాపకాలు

జలధీశ్వరస్వామి కాలెండర్ ఆవిష్కరణ

జలధీశ్వరస్వామి కాలెండర్ ఆవిష్కరణ

News Information

 స్థానిక జలధీశ్వర మరియు విశ్వేశ్వరాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనం గా జరిగాయి.భక్తులు పెద్ద సంఖ్య లో విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు.

 

వెంకట్రాయులు గారి మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు గ్రామస్తులు, హైదరాబాదులో ఉన్న వారి బంధువులంతా లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన కుమారులు నలుగురు మరియు కుమార్తె కూడా అమెరికాలోనే ఉండటంతో వారు వచ్చేవరకు ఆసుపత్రి లోనే ఆయన భౌతిక కాయాన్ని భద్రపరిచారు.

 

  గొర్రెపాటి వెంకట్రాయులు విద్యా ట్రస్ట్ అధినేత శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు గారు కొద్ది సేపటి క్రితం దివంగతులయ్యారు.ఆయన వయసు 90 సంవత్సరాలు.పొద్దున్న ఒంట్లో నలత గా ఉండటం తో చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాదు లో  గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.పరిస్తితి విషమించటం తో రాత్రి 10.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

 

 మా ఏకైక కుమారుడు రామనాద్ వివాహం 12.02.2012 న మచిలీపట్నంలో జరగనుంది. సమయాభావం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.

 

 దూర ప్రాంతాల్లో ఉండే స్వామి వారి భక్తుల సౌకర్యార్ధం ఈ కింది సేవలను ఆన్ లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉంచటం జరిగినది.కనుక ఈ సేవలను భక్తులు విశేషముగా ఉపయోగించుకుని స్వామి వారి సేవకు పాత్రులు కాగలరు.


 

 అమరరాజా బ్యాటరీస్ అధినేత శ్రీ గల్లా రామచంద్రనాయుడు మన గ్రామానికి విచ్చేశారు. చిరకాల మిత్రుడు అయిన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు ఆయనను వెంటబెట్టుకుని తీసుకురాగా ఆలయంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. 21.01.2012 శని త్రయోదశి కావటంతో అప్పటికే పూజలు జరిపించుకుంటున్న భక్తులతో పాటుగా, అయన కూడా ప్రత్యేక పూజలు జరిపించారు.