Other Links Information

 • ​డి ఆర్కే కబుర్లు

   చల్లపల్లి లో గత 30 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్న డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ గారు మనలో చాలామందికి వైద్యులుగా మాత్రమే తెలుసు. ఇటీవల స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమానికి రధసారధి గా స్థానిక ప్రజలకే కాకుండా అంతర్జాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రవాసులకి కూడా మరింత చేరువయ్యారు.ఇవే కాకుండా ఆయనలో ఒక మంచి రచయిత ఉన్నారు. సమాజాన్ని మేల్కొలిపే పలు వ్యాసాలను తన స్వీయ రచనతో అప్పుడప్పుడు కరపత్రాల రూపంలో ముద్రించి స్థానికంగా ప్రచారం కూడా చేస్తుంటారు.

  . ...readmore

 • చరిత్ర రచనా చక్రవర్తి-పండిత గొర్రెపాటి

   “ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం” అని ప్రశ్నించటంలో నిరాశావాదం కూడా ఉంది. నా దేశచరిత్రలో ‘ఇదీ గర్వ కారణం’ అని సగర్వంగా ప్రకటించటంలో జాతీయతా భావం వుంది. అసలైన అభ్యుదయ తత్త్వం వుంది. నిజమైన దేశభక్తి ఉంది.

  దేశ చరిత్రల రచన కత్తిమీది సాము. దాన్ని సుసాధ్యం చేసిన ‘చరిత్ర రచనా చక్రవర్తి’ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య దేశచరిత్ర రచనలకు కొత్త వొరవడి దిద్దారు. దేశీయులు చేయెత్తి జైకొట్టేలా వారిలో దేశభక్తిని నింపగలిగారు. గతమెంతో ఘనకీర్తిని చాటి చెప్పగలిగారు

  . ...readmore

 • ఘంటసాలలో నేను -డా.జి.వి.పూర్ణచందు

  ఘంటసాల గ్రామం తెలుగు నేలమీద ప్రాచీన బౌద్ధక్షేత్రాలలో తొలినాటిది. అశోకుడు కట్టించిన బౌద్ధస్తూపాలలో ఘంటసాల బౌద్ధస్తూపం కూడా ఒకటి. 1820లో ఘంటసాలలోని ఘోటకదిబ్బలో ఒక రైతు దున్నుతుంటే 60 శిల్పాలు బయట పడ్దాయనీ, పాండిచ్చేరి నుండి ఫ్రెంచి ఏజెంటు వచ్చి 5 వేల రూపాయలిచ్చి వాటిని తరలించుకు పోయాడనీ, అవి పారిస్ లోని గుయ్‘మెట్ మ్యూజియంకు చేరాయని చెప్తారు. బోస్టన్‘లో అతి ముఖ్యమైన ఘంటసాల శిల్పం ఉన్నట్టు డగ్లర్ బారెట్ వ్రాశాడు.

  . ...readmore

 • ఘంటసాలలో నేను - డా.జి.వి.పూర్ణ చందు

   పండిత గొర్రెపాటీ వేంకట సుబ్బయ్యగారి విగ్రహావిష్కరణ సభలో పాల్గొనటానికి ఘంటసాల వెళ్ళటం వలన ఆ ఊరి ముచ్చట్లు చాలా పరిశీలించే అవకాశం కలిగింది. ఆ సభలో మాట్లాడుతూ నా చిన్నప్పటి ఊసు ఒకటి చెప్పాను. 1966,67 సంవత్సరాలలో మా నాన్నగారి ఉద్యోగం నిమిత్తం మేం ఘంటసాలలో ఉన్నాం. నేను ఆరోతరగతి, ఏడో తరగతి అక్కడ హైస్కూల్లో చదువుకున్నాను. 1967లో ఆ ఊరికి మధురగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావుగారు వచ్చారు. ఆయనను ఏనుగు మీద ఊరేగించి, ఘనంగా సత్కరించారు

  . ...readmore

 • డాక్టర్ వేమూరి బాలకృష్ణ ప్రసాద్ ​

  . ...readmore

 • "ముగిసిన శకం" పై ఓ పాఠకుని స్పందన

   Unknowingly my eyes filled with tears with all those memories with Ghantasala. My early childhood during 80s my grandmother, my brother..friends..and many more fond memories.. which became a history now. your article touched us in this way.

  . ...readmore

 • జోహార్ కామ్రేడ్ జ్ఞానానందం

   కామ్రేడ్ జ్ఞానానందం మన గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో 8 వ వార్డు కి మెంబరుగా పోటీ చేశారు. ఇటీవల పరమపదించిన ఆయన వ్యక్తిత్వం గురించి డాక్టర్ డి ఆర్ కే ప్రసాదు గారు రాసిన ఆత్మీయ వచనాలు. 

  . ...readmore

 • నా ఘంటసాల ప్రయాణం

   ఎప్పుడూ కాంక్రీట్ జంగిల్ లో ఉండే మాకు అప్పుడప్పుడు పల్లెటూర్లో జరిగే పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఒక ఆటవిడుపులా అనిపిస్తుంది. కాలేజిలో నా పూర్వ విద్యార్ధి రాజేష్ వేమూరి కాల్ చేసి గురువుగారూ మీరు తప్పకుండా నా పెళ్ళికి రావాలి అనటంతో కొంత వాడి మీద ఉన్న వ్యక్తిగత అభిమానం, వాళ్ళ ఊరు చూడాలన్న ఉత్సుకత ఆ వివాహానికి పయనం కట్టించాయి. నేను నా సతీమణి మాత్రమే కాకుండా, రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకోలేక బాధపడుతున్న మా  DS ని కూడా వెంటేసుకుని హైదరాబాదు నుండి విజయవాడ దాకా మా కజిన్  కారులో బయలుదేరాం.అక్కడినుండి వాళ్ళు వేరే వివాహానికి వెళ్ళాల్సి ఉండటంతో మేము అక్కడనుంచి బస్సు లో వెళ్ళాలి.  విజయవాడ నుండి అవనిగడ్డ బస్సు ఎక్కి కూర్చున్నాక ఒక్కసారిగా జ్ఞాపకాల దొంతరలు కమ్ముకున్నాయి. 

  . ...readmore

 • అభివృద్ది అంటే ఇదేనా!!

   ఘంటసాల బాగా అభివృద్ధి చెందుతున్న గ్రామం, ఇది మనం చాలా కాలంగా వింటున్న మాట. కాని గ్రామం అభివృద్ధి చెందుతున్న మాటలో నిజం ఎంతో గాని, ఖచ్చితంగా మన గ్రామం  చాలా విషయాలలో మాత్రం అభివృద్ధి బాగా చెందుతోంది. ఈ విషయాలు నేను నా కంటి తో చూసినవి, విన్నవి.

  . ...readmore

 • "భూ" కైలాస్

   మీ అంచనా ప్రకారం మన ఊరిలో గజం స్థలం ఎంత ఉంటుందనుకుంటున్నారు? మీ మనసులో అంకె వందల్లో ఉంటే మీరు తప్పులో కాలేసినట్లే..ఇక మీకు ఊర్లో ఇంటి స్థలం వందల్లో దొరకదు.ఈ మధ్య మన గ్రామం లో ఇళ్ళ స్థలాలకి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది.ఒకప్పుడు గజం మూడు వందలకి మించని స్థలాలు ఇప్పుడు వెయ్యి పెడితే కానీ దొరకటం లేదు.అత్యంత ఖరీదైన ప్రాంతంగా పడమట బజారు మొదటి స్థానం లో నిలిస్తే,ఒకప్పుడు వైభవం గా వెలిగిన తూర్పు వీధి ఆఖరు స్థానం లో ఉంది.

  . ...readmore

 • గుర్తుకొచ్చాయి..

   మనతో చిన్నప్పుడు చదివిన ఫ్రెండ్స్ ఎందఱోవాళ్ళలో కొందరు మనకు గుర్తు ఉంటారు,

   

   కొందరినిమనం మరిచి పోతంకొందరిని మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటాం కాని 

  వాళ్ళు ఎక్కడ ఉంటారోమనకి తెలిదు.వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకి తెలుసు కాని వాళ్ళని కలవటం

  మాట్లాడటం మనకి కుదరక పోవచ్చు.

  . ...readmore