శ్రీ పెన్నేరమ్మ గుడి Back to list

 

గ్రామం నడిబొడ్డున ఉన్న గుడి ఇది 130 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడి శిధిలం అయిపోగా 1952 లో గొర్రెపాటి వెంకట్రామయ్య గారు చందాలు పోగు చేసి మండపం కట్టించారు. ప్రస్తుతం దీనిని బస్సు షెల్టర్ గా గ్రామస్తులు వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఈ దేవతకి ప్రతి శ్రావణ మాసంలో సంబరాలు జరిగేవి. మళ్ళీ  57 ఏళ్ల తరువాత తరువాత 30. 08. 2015 న  పెన్నేరమ్మ దేవస్థానం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే క్రమంలో  శ్రావణ మాసంలో గ్రామ యువత అందరూ కలిసి దాతల సహకారంతో ఆగస్టు 30 వ తేదిన సంబరం జరిపించారు.