ఆళ్ళవెంకమ్మ చెరువు :వాడుకలో దీని పేరు ఆలంకమ్మ చెరువు.ఇది మన ఉర్లో ఉన్న అన్ని చెరువులలోకి పెద్దది.దీని విస్తీర్ణం 21.40 ఎకరాలు.దీనిని గొర్రెపాటి వారి ఆడపడుచు ఆళ్ళ వారి కోడలు అయిన వెంకమ్మ గారు సుమారు 250 ఏళ్ల క్రితం తవ్వించుట చే దీనికి ఆళ్ళవెంకమ్మ చెరువు అని పేరు వచ్చింది.ఈమె కుమార్తె పేరమ్మ ను తన మేనల్లుడగు పాపన్న కు ఇచ్చుటవల్ల దీనికి వేమూరి వారి చెరువు అనికూడా అంటారు.కొంత కాలం ఇది గ్రామానికి మంచినీటి వనరుగా కూడా ఉన్నది.