మన చెరువులు Back to list

ఆళ్ళవెంకమ్మ చెరువు  :వాడుకలో దీని పేరు ఆలంకమ్మ చెరువు.ఇది మన ఉర్లో ఉన్న అన్ని చెరువులలోకి పెద్దది.దీని విస్తీర్ణం 21.40 ఎకరాలు.దీనిని గొర్రెపాటి వారి ఆడపడుచు ఆళ్ళ వారి కోడలు అయిన వెంకమ్మ గారు సుమారు 250 ఏళ్ల క్రితం తవ్వించుట చే దీనికి ఆళ్ళవెంకమ్మ చెరువు అని పేరు వచ్చింది.ఈమె కుమార్తె పేరమ్మ ను తన మేనల్లుడగు పాపన్న కు ఇచ్చుటవల్ల దీనికి వేమూరి వారి చెరువు అనికూడా అంటారు.కొంత కాలం ఇది గ్రామానికి మంచినీటి వనరుగా కూడా ఉన్నది.

 

దేవన్న చెరువు : ఇది ఆలంకమ్మ చెరువు ని ఆనుకుని ఉన్నది.దీనిని బోయపాటి దేవన్న అనే ఆయన స్వయంగా తవ్వించారు.

బోలెం గుంట : దీని అసలు పేరు బోడిలింగం గుంట.దీని సమీపం లోనే బౌద్ధ శిల్పాలు దొరికినవి.

గొర్రెపాటి వారి చెరువు : ఇది గ్రామానికి ఉత్తరం వైపున ఉంది.దీనికి పూర్వం ఒక గుంట ఉండేది దానిని మిఠాకాని గుంట అనేవారట.తదనంతరం గొర్రెపాటి బ్రహ్మన్న గారు సగం మిగతా గొర్రెపాటి వారు సగం ఖర్చుపెట్టి చెరువు గా తవ్వించారు.అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

కుమ్మరిగుంట :  : దీని అసలు పేరు రావూరి నారాయణ చెరువు ప్రస్తుతం ఈ పేరు ఎవరికి తెలియదు.దీని విస్తీర్ణం 1.89 ఎకరాలు. ఇందులో మట్టి తో చేసిన కుండలు పగిలేవి కాదట.అందుకే కుమ్మర్లు పాలెం వెళ్లిపోయారట.

సాలీల ధర్మచెరువు : : ఇది కుమ్మరిగుంటకి కొంచెం అవతలగా తూర్పు వైపున ఉంది.దీని విస్తీర్ణం 6.64 ఎకరాలు.దీనిని తుమ్మలచర్ల వెంకటరెడ్డి గారు సంపాదించారు.తదనంతరం వెంకటాద్రి అభివృద్ధి చేసారు..

కోమట్లచేరువు :  : ఇది గ్రామానికి పడమర వైపున ఉంది.

బోయీల చెరువు  : ఇది గ్రామానికి ఉత్తరం వైపున ఉన్నది.దీనిని ఘంటా బోయుడు అనే ఆయన తవ్వించారు.