మన ఘంటసాల ట్రస్ట్ Back to list

మన ఘంటసాల ట్రస్ట్ 
రిజిస్టర్డు నెం : 3/2016 
ఘంటసాల గ్రామం , కృష్ణాజిల్లా - 521133
 

 స్వఛ్చ ఘంటసాల కార్యక్రమం ద్వారా గ్రామంలో పరిశుభ్రత మరియు మౌలిక సదుపాయాల లక్ష్యంగా గ్రామంలోని కొంతమంది ఔత్సాహికులు ఒక బృందంగా ఏర్పడి ప్రతి రోజూ ఉదయం వీధుల్ని శుభ్ర పరచటంతో పాటు గ్రామస్తులతో సైతం చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్ధిక సహకారం కోసం మన ఘంటసాల ట్రస్ట్ అనే సంస్థ ని ఎన్ జి ఓ గా రిజిస్ట్రేషన్ చేసి తద్వారా ఈ ట్రస్ట్ పేరుమీద ఒక బాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చే విరాళాలని గ్రామంలో అభివృద్ధి పనులకి వినియోగించటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక రూపంలో ఆడిట్ ని ప్రకటించటం జరుగుతుంది. ఇందులో సభ్యులుగా ఎక్కువమంది గ్రామంలో నివసిస్తూ గ్రామాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్న వారిని నియమించుకోవటం ద్వారా ఈ ట్రస్ట్ సేవలని మరింత పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయి. 

 
చాలా ట్రస్ట్ ల ని ఛారిటబుల్ ట్రస్ట్ గా పిలవటం మనం చూస్తున్నాం. చారిటీ అనే పదం వాడకూడదు అని మేము నిర్ణయించుకున్నాం. ఇందుకు కారణం గొర్రెపాటి విద్యాట్రస్ట్ స్థాపకులు శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు చెప్పిన ఒక మాట." మనం మనుషులున్న సమాజంలో బతుకుతున్నాం కాబట్టే డబ్బులు సంపాదించగలుగుతున్నాం. అదే మనం ఒక దీవిలో మనుషుల్లేని చోట ఉంటే డబ్బులు సంపాదించగలిగేవాళ్ళం కాదు. మనకి డబ్బులు సంపాదించే అవకాశం ఇచ్చింది సమాజం. ఆ అవకాశం ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వటం మన భాద్యత. ఈ భాధ్యతని ఛారిటీ , దయ,సేవ అని పిలవకూడదు.ఇది కేవలం మన సంపదని మనకిచ్చిన సమాజంతో కలిసి పంచుకోవటం మాత్రమే "ఈ స్ఫూర్తి తోనే ఈ ట్రస్ట్ కి ఛారిటబుల్ అనే పదం వాడకుండా మనఘంటసాల ట్రస్ట్ అనే పేరు పెట్టాలని నిర్ణయించాం. ఇందుకోసం కార్యాచరణ ని రూపొందించటం జరిగినది. 
 
 
ట్రస్ట్ లక్ష్యాలు 
 
1. ట్రస్ట్ కేవలం గ్రామంలో, మండలంలో ఉన్న వ్యవస్థలకి , సంస్థలకి సాయపడటానికి మాత్రమే. 
2. ఎటువంటి వ్యక్తిగత సహాయాలు , స్కాలర్ షిప్పులు , వృద్దాప్య పించన్లు వంటివి ఇవ్వబడవు. 
3. మౌలిక సదుపాయాల అభివృద్ధి , టూరిస్టు ప్రాంతంగా గ్రామం అభివృద్ధి చెందటానికి అవసరమైన కార్యక్రమాలలో భాగస్వామ్యం. 
4. విద్యాలయాల అభివృద్ధి, త్రాగే నీరు , పరిశుభ్రత , మొక్కల పెంపకం కోసం ఎక్కువ నిధుల్ని వినియోగించటం జరుగుతుంది. 
5. అవసరమైనప్పుడు మండల గ్రామాల్లో వసతులకి కూడా ప్రాధాన్యం. 
6. కుల మత అసమానతలకి తావు లేకుండా అన్ని కార్యక్రమాలకి మద్దతు. 
7. గ్రామంలో జరిగే అన్ని ఊరుమ్మడి కార్యక్రమాలకి సహకరించటం. ప్రోత్సాహక బహుమతులు అందచేయ్యటం.
 
ట్రస్ట్ కార్య నిర్వాహక సభ్యులు 
 
శ్రీ మండలి బుద్ధప్రసాద్ - గౌరవ అధ్యక్షులు 
 
శ్రీ మూల్పూరి చెన్నారావు - అధ్యక్షులు  
 
శ్రీ గొర్రెపాటి సురేష్ - మేనేజింగ్ ట్రస్టీ
 
శ్రీ పోతన లక్ష్మీశ్వరరావు - కార్యదర్శి 
 
శ్రీ వడ్లమూడి వెంకట కృష్ణారావు - సభ్యులు 
 
శ్రీ గొర్రెపాటి రామకోటేశ్వరరావు - సభ్యులు
 
శ్రీ దోనేపూడి అహోబల రావు- సభ్యులు
 
శ్రీ పరుచూరి రవికుమార్- సభ్యులు  
 
శ్రీ కాగితపు రామమోహన్ రావు - సభ్యులు 
 
 
Account Number : 35621977550
Bank : State Bank of India
Branch : Ghantasala
IFSC Code : SBIN0011993
 
మీ విరాళాలని ఈ అకౌంట్ కి పంపగలరు