DRK kaburlu

 • రాబోతున్న పెనుముప్పు

   తాము అధికారం లోనికి వచ్చిన తర్వాత ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మార్చేస్తానని వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఎన్నికల వాగ్దానం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతటా పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలోనే ఉంటుందని కె.సి.ఆర్. ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు తన వైఖరి ఇటీవల ప్రకటించలేదు.

  . ...readmore

 • బాల్యాన్ని ప్రేమించే పెద్దలారా – నాకో సలహా ఇవ్వరూ!

   1978లో అట్లూరి పురుషోత్తం గారు “మాతృభాష లోనే ప్రాధమిక విద్య” జరగాలని రాసిన పుస్తకం చదివాను. పిల్లలు తమ సొంత భాషలో మాత్రమే తెలియని విషయాలను తెలుసుకుంటారని, తెలియని భాషలో తెలియని విజ్ఞానం తెలుసుకోవడం సాధ్యం కాదనీ ఆ పుస్తకంలో ఆయన నిరూపించారు. ఆడుతూ పాడుతూ గడపవలసిన బాల్యాన్ని పరభాషలో చదువుకోవలసి రావడం వలన “శిక్షణ” కాకుండా “శిక్ష”గా మారి సృజనాత్మకత కోల్పోతున్నారని ఆయన పడ్డ వేదన సహేతుకంగా అనిపించింది

  . ...readmore

 • ప్రతిభావంతునికి తండ్రి లేఖ

   నాన్నా!

  నీకు నేను నాన్ననైనా నిన్నలా పిలవడమే నాకిష్టం. మెడికల్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో నీకు మొదటి ర్యాంక్ వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. నీకష్టం ఫలించి నీవు లక్ష్యంగా పెట్టుకొన్న స్పెషాలిటీలోనే డాక్టర్ వి కాబోతున్నావు. నీ లక్ష్యాన్ని సాధిస్తున్నందుకు ఒక తండ్రిగా నాకు అత్యంత సంతోషం. ఎందుకంటే తమ పిల్లలు డాక్టర్లో, ఇంజనీర్లో, ఆడిటర్లో, కలెక్టర్లో కావాలని నిర్ణయించడం తల్లిదండ్రుల పనికాదని గట్టిగా విశ్వసించేవాణ్ణి నేను. 
  . ...readmore

 • ​కూడు పెట్టేది నైపుణ్యమే - ఇంగ్లీష్ కాదు​

  ఉద్యోగం రావాలంటే ఇంగ్లీషు తప్పనిసరిగా రావాలని, ఇంగ్లీషే ఈ ప్రపంచాన్ని ఏలబోతోందనీ, మిగతా భాషలు చచ్చిపోయినా బాధపడక్కరలేదనీ ప్రతి ఒక్కరు ఇంగ్లీషు నేర్చుకొంటేనే మన సమస్యలన్నీ పరిష్కారమౌతాయన్నంతగా ఇటీవల ప్రచారం జరుగుతోంది.

   

  . ...readmore

 • శుభకార్యాలలో పర్యావరణ రక్షణ

  ఇటీవల కాలంలో రకరకాల శుభాకార్యాలు - సరదా కలయికలు (GET-TOGETHERS), పుట్టినరోజు వేడుకలు, పెళ్ళి నిశ్చితార్ధాలు, మెహందీ వేడుకలు, సంగీత్ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, గృహప్రవేశాలు, అమ్మాయిలకు ఓణీలు, అబ్బాయిలకు పంచెలు ఇవ్వడం, పెళ్లి రజతోత్సవ వేడుకలు, షష్టిపూర్తి మహోత్సవాలు, ప్రముఖులకు సన్మానాలు, పూర్వ విద్యార్ధుల కలయికలు వగైరాలు నిర్వహించడం తరచుగా చూస్తున్నాం.

  . ...readmore

 • మంచి తల్లిదండ్రులంటే ఎవరు?

  పిచ్చిప్రశ్నలా ఉంది కదా! “తల్లిదండ్రులలో మంచివారు కానివారు కూడా ఉంటారా?” అని ఎదురు ప్రశ్నించాలనిపిస్తోండా? 30 ఏళ్ల క్రిందట ఒక రచయిత ఇలా అన్నాడు. “చెడు తల్లిడంద్రులుంటే ఉండవచ్చు కాని, చెడు పిల్లలు మాత్రం ఎక్కడా ఉండరు”.

   

   

  . ...readmore

 • ​ఒక హంబర్ సైకిల్ ముచ్చట​

   

   నన్ను కొన్న టీచర్ 3 సంవత్సరముల తరువాత ఇప్పటి ఓనర్ రామ్మోహనరావు గారికి అమ్మేశారు. ఈయన డ్రిల్ మాస్టారు. రోజూ ఆయన్ని స్కూల్ కి తీసుకెళ్లడం, తీసుకురావడం నా పని. నాకప్పుడు స్కూల్లో చాలా మంది స్నేహితులు ఉండేవారు(తోటి సైకిళ్ళు) తరువాత వారి పెద్దబ్బాయి మెడికల్ కాలేజీలో చేరిన తరువాత నన్ను తీసుకువెళ్ళి, మెడికల్ కాలేజికి హాస్టల్ కి తిప్పేవాడు. ఆతరువాత వారి చిన్నబ్బాయి దావణగిరిలో ఇంజనీరింగ్ చేరినప్పుడు మళ్లీ అక్కడికి వెళ్ళాను

  . ...readmore

 • పదవ తరగతిలో నూరుశాతం ఫలితాలు

  పదవ తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధ్యమా? అవసరమేనా ?
  ఈ నిర్ణయం యొక్క సాధ్యా సాధ్యాలను ఆవశ్యకతను పరిశీలించవలసిందే !
  పిల్లలలో చదువుమీద ఆసక్తి , అభిరుచి ఒకేస్థాయిలో ఉండటమనేది ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు.  
  . ...readmore