​డి ఆర్కే కబుర్లుBack to list

చల్లపల్లి లో గత 30 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్న డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ గారు మనలో చాలామందికి వైద్యులుగా మాత్రమే తెలుసు. ఇటీవల స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమానికి రధసారధి గా స్థానిక ప్రజలకే కాకుండా అంతర్జాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రవాసులకి కూడా మరింత చేరువయ్యారు.ఇవే కాకుండా ఆయనలో ఒక మంచి రచయిత ఉన్నారు. సమాజాన్ని మేల్కొలిపే పలు వ్యాసాలను తన స్వీయ రచనతో అప్పుడప్పుడు కరపత్రాల రూపంలో ముద్రించి స్థానికంగా ప్రచారం కూడా చేస్తుంటారు.అలా గత 30 ఏళ్లుగా ఆయన రాసిన పలు వ్యాసాలని మరింత విస్తృతంగా ప్రజలకి చేరాలనే ఉద్దేశ్యంతో వాటన్నిటిని అంతర్జాలంలో పొందుపరుస్తున్నాం. జనవిజ్ఞాన వేదిక ద్వారా ప్రజల్ని మూఢ విశ్వాసాల నుండి చైతన్య వంతుల్ని చేయటమే కాకుండా అప్పుడప్పుడు తన వ్యాసాలతో , ప్రసంగాలతో హాస్య చతురత ని కూడా పంచుతూ ఉంటారు.