Europe Travelogue

 • నా ఐరోపా యాత్ర - 30 (ముగింపు)

   నిన్న రాత్రి వచ్చిన పీడకల తలుచుకుంటూ ఈ రోజు పడుకోకుండా ఉండలేము. ఎంత మంచి కల వచ్చినా అందులోనే ఉండిపోయి నిద్ర లేవకుండా ఉండలేము. మనిషి గమనమైనా అంతేఎక్కడా దేనికోసం మనం ఆగలేము. మనకోసం ఏదీ ఆగదు. వుయ్ జస్ట్ మూవ్ ఆన్ అంతే. 

  . ...readmore

 • నా ఐరోపా యాత్ర - 29 (చెక్ రిపబ్లిక్)

  హైదరాబాద్ లో ఎర్రగడ్డ గోకుల్ ధియేటర్ ఎదురుగా రోడ్డులోకి వెళితే జెక్ కాలనీ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది. అసలు జెక్ కాలనీ వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా సిటీలో కలిసిపోయింది కాని ఒకప్పుడు ఇది సిటీ శివారు ప్రాంతం. అశోక్ లేలాండ్ , ఆల్విన్ , ఆస్బెస్టాస్ లాంటి ఎన్నో పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉండేవి. దానికంటే ముందు నిజాం కాలంలో ఒక మందుగుండు ఫాక్టరీ ఇక్కడ ఉండేది. ఆ ఫాక్టరీ నిర్మాణ నిమిత్తం జెకోస్లోవేకియా దేశం నుండి ఇంజినీర్లని ఇక్కడికి పిలిపించారు. 

  . ...readmore

 • నా ఐరోపా యాత్ర - 28 ( నెదర్లాండ్స్ )

  ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు మాత్రమే కాదు, స్వలింగ సంపర్కులకి సంభందించిన ఏదో ముఖ్యమైన రోజు. అక్కడున్న మీటింగ్ పాయింట్ దగ్గర మగవాళ్ళంతా చేరి ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు. కొంతమంది బిగ్గరగా ఏదో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే భార్గవి భయపడింది. మాక్సిం చిన్న వాడు కావటంతో మార్చిన్ దంపతులు కూడా అటు వైపు చూడకుండా తీసుకొచ్చేసారు. నాకు దీని గురించి తెలియటంతో పెద్ద ఆశ్చర్యం కలగలేదు.

   

  . ...readmore

 • నా ఐరోపా యాత్ర - 27 (నెదర్లాండ్స్)

   బ్రస్సెల్స్ నుండి నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాం కి 250 కిలోమీటర్లు. సరిగా మధ్యాహ్నం 1.30 గంటలకి ఆటామియం నుండి బయలుదేరాం. దాదాపు గంటన్నర ప్రయాణించాక గూగుల్ మాప్స్ లో చూస్తే బెల్జియం - నెదర్లాండ్స్ బోర్డర్ అని కనిపించింది. హైవే మీద ఉన్న మెక్ డొనాల్డ్స్ దగ్గర లంచ్ కోసం కార్ ఆపాడు మార్చిన్. గంట తరువాత మా ప్రయాణం మళ్ళీ ప్రారంభమైంది.

  . ...readmore

 • నా ఐరోపా యాత్ర - 26 (బెల్జియం)

   లక్సెంబర్గ్ నుండి బ్రస్సెల్స్ 240 కిలోమీటర్లు. మేము బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. నేరుగా ప్రయాణించి సాయంత్రం 6 గంటలకల్లా బ్రస్సెల్స్ చేరుకున్నాం. ముందు రోజు రాత్రి కూడా నిద్ర లేకపోవటంతో నేరుగా హోటల్ కి చేరుకొని ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నాం. మరుసటి రోజు ఉదయం మే 4 వ తేది 2013 మా అదృష్టమో లేక యాద్రుచ్చికమో తెలియదు కాని ఆ రోజున మేము బ్రస్సెల్స్ లో ఉండగలిగాం.

  . ...readmore

 • నా ఐరోపా యాత్ర - 25 (లక్సెంబర్గ్)

   పారిస్ నుండి నేరుగా బెల్జియం వెళ్దామని అనుకున్నాం. అలా వెళితే కేవలం 4 గంటల్లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరుకోవచ్చు. కాని ఈలోపు మార్చిన్ మరో ఆలోచన చేశాడు నేరుగా బెల్జియం వెళ్లి ఏమి చేస్తాం అర్దరాత్రి పూట అని కారుని లక్సెంబర్గ్ వైపు పోనిచ్చాడు. అలా మా ప్లాన్ లో లేకుండానే మరో దేశం వెళ్ళాము. వెర్సైల్స్ నుండి లక్సెంబర్గ్  430 కిలోమీటర్లు దూరం. అప్పటికి సమయం రాత్రి 9 గంటలు అవుతోంది.అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి.

  . ...readmore