Europe Travelogue

  • నా ఐరోపా యాత్ర - 24 (పారిస్)

     ముందు రోజు రాత్రి బాగా ఆలస్యమవటం, ప్రయాణ బడలిక తీరకపోవటంతో మరుసటి రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా నిద్ర లేచాం. ఆరోజు నేను చూడాలనుకున్న గుయ్ మెట్ మ్యూజియం కి వెళ్లి అదయ్యాక రాత్రికి బెల్జియం వెళ్ళాలని అనుకున్నాం. అసలు నేను అనుకున్నమ్యూజియం అదో కాదో అనే సందేహంతో పాటు మా ఊరి శిల్పాలు అక్కడ ఉన్నాయో లేదో అనే సందేహం మరొకటి. రామాయణం లో పిడకల వేట లాగా ఈ శిల్పాల గొడవేంటి అనుకుంటున్నారా ? వీటి కధ దాదాపు 90 ఏళ్ల క్రితం జరిగింది.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 23 (పారిస్)

     జూరిచ్ నుండి పారిస్ 600 కిలోమీటర్లు. భార్గవి, కాషా వెనుక సీట్లో కునికి పాట్లు పడుతున్నారు. మాక్సిమ్ అప్పటికే నిద్రపోయాడు. నేను మార్చిన్ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మధ్యలో 2 టోల్ గేట్స్ వచ్చాయి. మన దగ్గర లాగా మనుషులెవరూ అక్కడ లేరు. మనం అవసరమైన చిల్లర వేస్తే ఎలక్ట్రానిక్ గేటు తెరుచుకుంటుంది. సరిపడినంత చిల్లర లేకపోవటంతో నేను క్రెడిట్ కార్డులోనే పే చేసాను. నాకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కాసేపటి తరువాత కారు ఒక విశాలమైన పెట్రోల్ బంక్ ఆవరణలో ఆగింది.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 22 (స్విట్జర్లాండ్)

     ఇప్పుడు మేము వెళ్ళబోయేది స్విట్జర్లాండ్ లో Schaffhausen లో ఉన్న రైన్ ఫాల్స్ అనే జలపాతం. ఇది ఆ దేశానికి ఉత్తరభాగాన ఉంది. అంటే మేము ఉన్న ఆస్ట్రియా సరిహద్దు నుండి 120 కిలోమీటర్లు. ఆస్ట్రియా కి స్విట్జెర్లాండ్ కి మధ్యలో ఒక నది ఉంది అదే ఆ రెండిటి మధ్య బోర్డర్. ఆ బోర్డర్ దగ్గర పోలీసులు కార్లు ఆపి చెక్ చేస్తున్నారు.మేము మా పాస్ పోర్ట్లు తీసుకుని చెక్ పోస్ట్ లోకి వెళ్లి చూపించాము. పోలాండ్ వీసా ఉండటంతో చెక్ చేసి వెంటనే ఇచ్చేసారు. 

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 21 (ఆస్ట్రియా )

     లిచ్టేన్ స్టెయిన్ నుండి మా తరువాతి ప్రయాణం ఆస్ట్రియా లోని రోల్స్ రాయ్స్ మ్యూజియం.ఈ మ్యూజియం ఒక ప్రైవేటు వ్యక్తిది. Franz Vonier అనే వ్యక్తి తనకున్న హాబీ తో దాదాపు 1000 రోల్స్ రాయస్ కార్లని సేకరించి మ్యూజియం గా ఏర్పాటు చేసాడు.ముందు రోజు రాత్రి మేము బస చేసిన హోటల్ లో ఈ మ్యూజియం తాలూకు వివరాలని చూడటంతో ఇది చూశాక అక్కడినుండి స్విట్జెర్లాండ్ వెళదామని అనుకున్నాం. లిచ్టేన్ స్టెయిన్ నుండి స్విట్జెర్లాండ్ వెళ్ళాలంటే ఆస్ట్రియా మీదుగానే వెళ్ళాలి. 

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 20 (లిచ్టేన్ స్టెయిన్)

     ఇక ఆరోజుకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని వాడుజ్ నుండి షాన్ పట్టణం మీదుగా ఆస్ట్రియా బోర్డర్ చేరుకున్నాము. 28 రాత్రికి ఆస్ట్రియాలో జుగెన్ బెర్గ్ లో బస చేసాం. మరుసటి రోజు ఉదయం బయలుదేరి షాన్ పట్టణానికి చేరుకున్నాం. వాడుజ్ కంటే కూడా షాన్ ఎంతో అందంగా కనిపించింది. అసలు అవి రోడ్లా లేక అద్దాలో తెలియలేదు. పార్కింగ్ మొత్తం భూమిలోపలే ఉంది. ఇక్కడ రోడ్ల మీద పాదచారులకే ప్రాధాన్యత ఎక్కువ. ఎవరైనా రోడ్డు దాటటానికి నిలబడితే చాలు,వాహనాలన్నీ ఆగిపోతాయి. పాదచారులు రోడ్డు దాటాకే కార్లు ముందుకి కదులుతాయి.

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర - 19 (లిచ్టేన్ స్టెయిన్)

     వెనిస్ చూసి వచ్చిన 15 రోజులకి మా అసలైన ఐరోపా యాత్ర ప్రారంభమైంది. మాతో పాటు నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ క్రదోహ దంపతులు వారి అబ్బాయి మాక్సిమ్ తో కలిసి కారులో 15 రోజుల పాటు జర్మనీ, ఆస్ట్రియా, లిచెన్ స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, లక్సెం బర్గ్ , బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో మేము సాగించిన దాదాపు 4000 కిలోమీటర్ల ప్రయాణం ఇది. యూరప్ లో ఉన్న ఒకానొక అతి చిన్నదేశం లిచ్టేన్ స్టెయిన్. 

    . ...readmore