"భూ" కైలాస్

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

వైభవంగా విగ్రహ ప్రతిష్ట

వైభవంగా విగ్రహ ప్రతిష్ట

నందమూరి జ్ఞాపకాలు

నందమూరి జ్ఞాపకాలు

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

Teample Pages

 మన ఊరిలో తప్ప ప్రపంచం లో మరెక్కడా వినపడని కనపడని ఆలయం మన జలధీశ్వరాలయం.ఇటీవల కాలంలో బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం గా మరింత ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఆగస్త్య మహాముని చేత ప్రతిష్టించబడిన ఈ ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ స్వామి వారికి జలాభిషేకం చెయ్యరు.లింగం విభూది పూతతో తెల్లగా ఉంటుంది.ఈ గుడిలో జలధీశ్వరితో పాటు స్వామివారు ఒకే పానపట్టం పై వెలసి ఉన్నారు.

 

 ఈ స్తూపం ఘంటసాలకు ఈశాన్య భాగాన ఉంది.వాడుక భాషలో మనందరికి తెలిసిన దీని పేరు లంజదిబ్బ.కాని అతి పవిత్రమైన ఈ స్తూపాన్ని అలా పిలవటం సరికాదు.1870లో మొదటిసారిగా ఈ స్తూపం వెలుగులోకి వచ్చింది.అప్పటి కలెక్టర్ అయిన బాస్పెల్ మొదటిసారిగా స్తూపాన్ని గురించి ప్రభుత్వానికి తెలియచేశారు.ఆ తరువాత 1906 లో పురావస్తు శాఖాధికారి అయిన అలెగ్జాండర్ రే స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్టును ప్రచురించాడు.

 

  నేటి ఘంటసాల గ్రామం సుమారు 300సంవత్సరాలక్రితముది గానే మనకి తెలుసు.శతాబ్దాలనాటి చరిత్ర తెలుసుకోవటానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.నేటి ఘంటసాలకి ప్రాచీనులు బ్రాహ్మణులు,విశ్వబ్రాహ్మణులు,కాపులు,ముత్తరాచులు అని తెలియటానికి ఆధారాలున్నవి.

 


ఎన్నో సంవత్సరాల తపస్సు,మరెంతోమంది మహానుభావుల కృషీఫలం మన మ్యూజియం.19వ శతాబ్ధపు ప్రధమంలో ప్రజలకు అవగాహన లేక దొరికిన బౌద్ధ అవశేషాలను,మరియు పాలరాతి శిల్పాలను,చాకలి బండలు గాను ,పిల్లలు వాటిని పగులగొట్టి గోడలపైన రాసే చాక్ పీసులుగాను వాడేవారు.అప్పటి వారి అవగాహనాలేమి వల్ల అరుదైన మన శిల్ప సంపద అంతా పారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియం కి తరలిపొయింది.