భావనాఋషి ఆలయంBack to list

 పద్మశాలీలకు   ఆరాధ్యదైవం   భావనాఋషి  ఆలయం

 నేటి ఘంటసాల గ్రామం సుమారు 300సంవత్సరాలక్రితముది గానే మనకి తెలుసు.శతాబ్దాలనాటి చరిత్ర తెలుసుకోవటానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.

నేటి ఘంటసాలకి ప్రాచీనులు బ్రాహ్మణులు,విశ్వబ్రాహ్మణులు,కాపులు,ముత్తరాచులు అని తెలియటానికి ఆధారాలున్నవి.

లాండు రిజిష్టర్ ప్రకారం భూములన్నీ వారి పేరుమీదే ఉన్నవి.నేడు అన్నీ కమ్మవారి పరం అయినవి.నేటి మన ఘంటసాల అతి పెద్ద కమ్మటూరుకమ్మవారి తర్వాత అధికజనాభా కలవారు పద్మశాలీలు.నేత చీరలకు ప్రసిద్ధి చెందిన గ్రామం మన ఘంటసాల.1947 నాటికే 400 మగ్గాలు ఉండేవి.ప్రస్తుతం ఆ సంఖ్య కొంచెం తగ్గిందనే చెప్పాలి.పద్మశాలీలు స్వసంఘ పురోహితులు. మర్యాద,మన్ననలో వీరికి వీరే సాటి.ఒకపుడు వీధినాటకములు ఆడుటలోనూ ప్రసిద్ధి గాంచారు.వీరి పూర్వీకులలో తుమ్మలచర్ల వెంకటసుబ్బయ్య సిద్ధాంతి ప్రఖ్యాతి గాంచారుకేవలం వృత్తి పరంగానే కాక గ్రామరాజకీయాల్లోనూ గ్రామాభివృద్ధి లోను వీరి పాత్ర ప్రశంసనీయం.ప్రస్తుతం గోటకం అత్యధికులు నివసించే ప్రాంతం.తుమ్మలచర్ల,నందం,అందె ,జంజనం,మొదలైన వారు పద్మశాలీల్లో ప్రముఖులు.వీరికి ఒక చెరువు మరియు ఒక దేవాలయము ఉన్నవిభావనాఋషి వీరికి ఆరాధ్య దైవం. ప్రతి ఏటా ఈ ఉత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.

తుమ్మలచర్ల గోవిందరాజులు ఈభావనాఋషి విగ్రహాన్ని ఒక పెంకుటింట్లో ప్రతిష్టించారు.ఇటీవలే ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించి అభివృద్ధిచేశారు

(1966 లో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాసిన ఘంటసాల చరిత్ర ఆధారంగా)