ఇప్పుడున్న రాజ్య లక్ష్మి ధియేటర్ కంటే ముందు మన ఊరులో మరో సినిమా హాల్ ఉండేది. చాకలి బజారులో తడికలతో నిర్మించిన ఓ పాకలో ఒకే ప్రొజెక్టర్ తో సినిమాలు ప్రదర్శించేవాళ్ళు. అంటే సినిమా 14 రీళ్ళు ఉంటే ప్రతి రీలు మార్చటానికి 14 సార్లు విరామం ఉండేదన్న మాట.
ఇప్పుడు ధియేటర్ లో అంటే కష్టమే కానీ,ఎప్పుడైనా T.V లో దేవుడుచేసినమనుషులు సినిమా వస్తే మాత్రం టైటిల్స్ మిస్ అవ్వకండి. సినిమా పేరు కంటే ముందు మీకొక టైటిల్ కనిపిస్తుంది ఈ కింద ఉన్నట్లు.
పదివేల సంవత్సరాలకి ఒకే కాలెండర్ ని రూపొందించారు మన గ్రామానికి చెందిన గొర్రెపాటి పార్ధ సారధి.గణితం లో నిష్ణాతులైన ఈయన ఈ కాలెండర్ రూపకల్పన తో అందరిని ఆశ్చర్యనందాలకి గురిచేసారు.