ఉనికి లేని ఊరుBack to list

 రెవిన్యూ రికార్డులలో తప్ప అసలు ఉనికి లేని ఒక ఊరు మన మండలంలో ఉంది. చాలా ఏళ్ల క్రితం ఘంటసాల మండలంలో ఎలికలకుదురు అనే ఒక గ్రామం ఉండేది.కొన్ని కుటుంబాలు అక్కడ నివసించేవి కూడా. కాలక్రమంలో అక్కడి కుటుంబాలన్నీ తలొదిక్కుగా వలస వెళ్లిపోవడంతో అసలు ఆ ఊరు అనేది లేకుండా పోయింది. కాని గ్రామ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆ ఊరు అలాగే ఉంది. అక్కడి పొలాల రికార్డులన్నీ ఎలికలకుదురు పేరుతోనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మనుషులు లేరు , ఊరు ఉండేది అనే ఆనవాళ్ళు లేవు. ఘంటసాల నుండి మల్లాయి చుట్టూరు వెళ్ళే రోడ్ లో మఱ్ఱిచెట్టు ఉన్న ప్రాంతంలో ఈ ఊరు ఉండేది. గొర్రెపాటి రంగనాధబాబు గారు నిర్మించిన చెక్ డ్యాం ఈ గ్రామ పరిధిలోనే ఉంది. 

 

Dated : 10.09.2015