శ్రీ దోనేపూడి రత్తయ్య గారుBack to list

 

శ్రీ దోనేపూడి రత్తయ్య గారు

 

మన ఊరికి పశువుల ఆసుపత్రి 1965 లో వచ్చింది. అంతకుముందు సాధారణ నాటు వైద్యులనే ఆశ్రయించేవారు. మనుషులకి లాగానే ఆయుర్వేద సంభందిత  మూలికలతోనే పశువులకి కూడా వైద్యం చేసేవారు. మన గ్రామం లో ఎటువంటి విద్యార్హత లేకుండా కేవలం తనకున్న పరిజ్ఞానంతో పశు పోషణ లో సాధించిన అనుభవంతో అలాంటి వైద్యాన్ని ఉచితంగా అందించిన వ్యక్తి శ్రీ దోనేపూడి రత్తయ్య గారు.అయన వైద్యానికి ఎటువంటి రోగమైనా హరించుకుపోయేదని పెద్దలు చెప్తారు.కానీ ఆయన వాడిన ఔషధాలు ఏమిటో వాటి మర్మమేమిటో ఎవరికీ తెలిసేది కాదు.ఆయన చనిపోవటానికి ఒక్క రోజు ముందే తీసిన ఫోటో ఇది.విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ దోనేపూడి వెంకట రత్నం గారు ఈయన మనుమడు...

Dated : 27.05.2012