బౌద్ధ స్తూపం Back to home

 

 మౌర్య చక్రవర్తి అశోకుడు భౌద్ధ మత ప్రచారం కోసం క్రీస్తుపూర్వం 249వ సంవత్సరం లో మహదేవుడనే భౌద్ధ భిక్షువు ను దేశంలోని వివిధప్రాంతాలకు పంపాడని మహదేవుడు తన వెంట తెచ్చిన భౌద్ధ ధాతువులను ఘంటసాల,నాగార్జునకొండ,అమరావతిలలో నిక్షిప్తం చేశాడని 'దివ్య వాదన 'అనే గ్రంధం లో వివరించబడింది.ప్రస్తుతం ఘంటసాల లో ఉన్నంత పెద్ద స్తూపం నాగార్జునకొండ,అమరావతి ల లో లేదు.అదీ కాక మన స్తూపం  70శాతం యధాతధంగా ఉంది.మిగతా స్తూపాలు శిధిలం అయిపోగా పునర్నిర్మించారు .భౌద్ధ మతస్తులు తమ మత స్తూపాలను,సంఘారామములను,సహజ సుందర ప్రదేశములలోనూ విస్తార జలసంపదలున్న ప్రాంతాలలోనూ నిర్మించారు .బుద్ధభగవానుడు సకల భోగాలతో జీవనం సాగించే సమయం లో మానవ జీవితంలో దుఖ నివారణకి మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం లో అర్ధరాత్రి వేళ భార్యాపిల్లలను, రాజ్యాన్ని విడిచి ఒక అశ్వము పై ఎక్కి వెళ్ళిపోతాడు.బుద్ధునికి ప్రియమైన ఆ అశ్వము పేరు కంటకము.ఆ కంటకము పేరిట నిర్మించబడిన మన గ్రామము కంటకశైల గా ప్రసిద్ధి పొంది ఆ తరువాత ఘంటసాల గా నామాంతరం చెంది ఉండవచ్చు.ఇక స్తూపం అంటే భౌద్ధం లో చైత్యం అని అర్ధం.అయిదు స్తూపాలు ఒకచోట ఉంటే అది మహాచైత్యం అంటారు కాబట్టి ఘంటసాల మహాచైత్యం.అనేక భౌద్ధ శిల్పాలు,పూసలు,రోమను నాణాలు,పాలరాతి స్తంభాలు ఈ స్తూపము సమీపం లో దొరికాయి.

ఘంటసాల పురాతన రేవు అని చెప్పటానికి ఆధారాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి 13వ శతాబ్ధం వరకు ఘంటసాల ఓడరేవు గా గుర్తించబడింది.ఈ ఓడరేవు నుంచి పాశ్చ్యాత్య దేశాలకు వ్యాపారులు తరలి వెళ్ళేవారు.ఆ రోజుల్లో రోమను నాణాలు చెలామణి లో ఉండేవి.ఈ స్తూపము దగ్గర జరిపిన తవ్వకాలలో రోమను చక్రవర్తి బొమ్మ ఒకవైపు,సముద్రుడి బొమ్మ ఒక వైపు ఉన్న నాణేలు దొరికాయి.