విశ్వేశ్వరాలయంBack to list

  విశ్వేశ్వరాలయం          

 జలధీశ్వరాలయం తర్వాత అతి ప్రాచీనమైనది మన విశ్వేశ్వరాలయం.

ఈ ఆలయం శిధిలమైపోగా బోలెం గుంటలో లింగాకారమును తెచ్చి మట్టి ఆడుసు తో చిన్న ఆలయమును కట్టించారు.కొంతకాలానికి అదీ శిధిలమైపోగా రెంటచింతల అచ్చన్న అనే ఆయన కాశీ నుంచి ఒక లింగమును తెచ్చి వేమూరి ఘంటయ్య గారి సహకారముతో ఇపుడు ఆలయమున్న ప్రదేశంలో 1860లో నిర్మించారు.ఈ స్వామికి దేవరకోట గ్రామస్థులైన దోనేపూడి పెదసుబ్బన్న గారు ధ్వజస్థంభ ప్రతిష్ట చేశారు.అచ్చన్న గారి హయాంలో ఈ దేవుని కల్యాణం శివరాత్రికి అత్యంత వైభవంగా  జరిగేదట.ఇప్పటికి కూడా శివరాత్రికి ఈ దేవాలయాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు.ఇంతకుముందు ఈ స్వామికి తెప్పోత్సవం జరిగేది.ఆళ్ళ వెంకమ్మ చెరువులో తెప్ప కట్టి స్వామి వారిని సాని మేళంతో తిప్పేవారు.కొంతకాలానికి ఈ దేవాలయం కూడా శిధిలమైపోయింది.మళ్ళీ 1905 లో వేమూరి వెంకటరత్నం,చలమయ్య,రామస్వామి గారలు ఊర్ల వెంట తిరిగి సొమ్ము వసూలు చేసి మరియు స్థానికుల శ్రమదానం తోఅ దేవాలయ పునర్నిర్మాణం చేశారు.మరల దోనేపూడి పెదసుబ్బన్న గారి కుమారుడు పెదపాపన్న గారు ఇత్తడి తొడుగు తో ధ్వజ స్తంభ ప్రతిష్ట చేశారు.1920 లో దేవాలయ సిం హ భాగముపైన గాలిగోపుర నిర్మాణం జరిగింది.1925 లో కల్యాణ మండపం,1926 లో దేవాలయ విమానం నిర్మించబడ్డాయి.

 ఈ దేవాలయానికి మంచి భూవసతి ఉంది.ఇటీవల దాతల ఔదార్యంతో దేవాలయం మరింత అభివృద్ధి చెందింది.ప్రతి శివరాత్రి కి దేవుని కల్యాణం రంగ రంగ వైభవంగా జరుగుతుంది.