మన నూతులుBack to list

1) లింగం నుయ్యి : దీనిని మలకల నుయ్యి అని కూడా అనేవారు.దీని పక్కన ఒక జమ్మిచెట్టు ఉండేది.ఆ చెట్టు కింద ఒక లింగం ఉండేది దాని నుండి ఎప్పుడూ నీరు చెముర్చుతూ ఉండేది.దానిని ప్రజలు ఆరాధిస్తూ ఉండేవారట.ఒక శాస్త్రవేత్త దీనిని పరిశీలించి దీనిని పూజిస్తే గ్రామారిష్టం అని చెప్పగా నూతిలో పడవేశారు.అప్పటినుంచి దీనికి లింగం నుయ్యి అని పేరు.పడమటి వైపున వడ్లమూడి పరమేశ్వరుడు గారి ఇంటిపక్కనె ఉండేదట ప్రస్తుతం ఇది పూడిపొయినది.

2)వడ్లమూడి వారి నుయ్యి : పూర్వం వడ్లమూడి వారు పొగతోటలకు మోట నుయ్యి గా ఉపయోగించెవారు.ఇది బండి రామయ్య గారి ఇంటికి తూర్పు వైపున ఉంది.
 
3)బండి వారి ధర్మగాడి నుయ్యి : ఇది గోటకమును ఆనుకుని ఉంది.వేసవి కాలంలో వ్యవసాయానికి ఈ నూతిని ఉపయోగించేవారు.బండి వారు ఆకాలంలో బలవంతులు.
 
4)బండి వారి నుయ్యి : ఇది బండివారి వద్లమూడి వారి రామాలయం దగ్గర ఉంది. పూర్వం ఇది సిరిపురం వారిదట వీరెవరు నేడు లేరు.
 
5)పేరమ్మ నుయ్యి : ఇది గొర్రెపాటి వారి చెరువు మీద ఉన్నది.వేమూరి పాపన్న గారి భార్య పేరమ్మ సుమారు 250 ఏళ్ల క్రితం ఈ నుయ్యిని తవ్వించారు.ఈమె ఆళ్ల వెంకమ్మ కుమార్తె.తల్లి దక్షిణం వైపు చెరువు తవ్విస్తే కుమార్తె ఉత్తరం వైపు నుయ్యి తవ్వించారు.
 
6)పెద్ద శెట్టి ఇంటివెనుక నుయ్యి : పేరు తప్పించి మిగతా ఆధారాలు గాని ఆనవాళ్లు గాని లేవు.
 
7)గాజుల వారి నుయ్యి : గొర్రెపాటి వెంకట్రాయులు గారి ఇంటికి తూర్పు వైపున ఉంది.
 
8)నాయుడమ్మ నుయ్యి : ఇది తూర్పు వైపున మిల్లుకి పడమరగా ఉంది.
 
9)వేమూరి జానకిరాముడు గారి నుయ్యి : ఇది ఊరు మధ్యలో ఉండేది కాని ఇప్పుడు లేదు.
 
10) దక్షిణ నుయ్యి : కాస్తో కూస్తో ఈ తరం వాళ్ళకి తెలిసిన నుయ్యి ఇదొక్కటే.దీనిచుట్టూ ఉన్నది గొర్రెపాటి వారు వారే దీనిని కట్టించి ఉండవచ్చు.
 
11)రామన్న గారి నుయ్యి : ఇది వేమూరి నాంచారయ్య గారి ఇంటిముందు ఉండేది.ఇది మోట నుయ్యి పూర్వం ఆ ప్రదేశమంతా పొగాకు తోటలు వేసేవారు.
 
12) వేమూరి వారి నుయ్యి : ఇది వేమూరి గోపాలకృష్ణయ్య గారి ఇంటివద్ద చేలో స్థూపమునకు దగ్గర్లో ఉంది.
 
13) అచ్చమ్మ నుయ్యి : ప్రస్తుతం ఇది లేదు.వేమూరి సుబ్బయ్య గారి కుమార్తె అచ్చమ్మ ఇందులో పడటం వల్ల దీనికా పేరు వచ్చింది.
 
14) ఘంటయ్య గారి నుయ్యి : ఇది దక్షిణం వైపు మిల్లుని ఆనుకుని ఉండేది.ప్రస్తుతం లేదు.