జలధీశ్వర భక్తి గీతాల ఆవిష్కరణBack to list

 శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వరస్వామీ వారిపై రూపొందించిన ఆడియో సిడి ని ఈరోజు శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారు. శ్రీ గజల్ శ్రీనివాస్ స్వరకల్పనలో ఆయనే స్వయంగా పాడిన సుప్రభాతం మరియు మూడు భక్తి గీతాలని శ్రీ కోలుప్రోలు మాధవరావు మరియు శ్రీమతి పోలాప్రగడ రాజకుమారి రచించారు . గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ , సేవ్ టెంపుల్స్ సౌజన్యంతో ఈ గీతాలని రూపొందించినట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలయ పునర్వైభవ నిర్మాణ సారధి శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ కార్యక్రమానికి సమన్వయకర్త గా వ్యవహరించారు. 

 

Dated : 05.04.2016