సతీ స్మృతి - గొర్రెపాటి వెంకట సుబ్బయ్య Back to list

మధురజీవి  గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 

 

ఇప్పటివరకు తనతో జీవితాంతం నడచి ,తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న సహధర్మ చారిణి కి తమ రచనలని అంకితమిచ్చిన రచయితలున్నారు. కానీ ప్రపంచం లో ఏ రచయితా తన భార్య గురించి ఒక గ్రంధం రాసిన దాఖలాలు లేవేమో...భార్య అంటే ఒక బానిస ,ఒక వంట మనిషి ,భార్య భర్తల సంభందం అంటే యజమాని , సేవక సంభందం అనే బూజు పట్టిన భావాలున్న దశకాల్లో జీవించిన అపురూపమైన దంపతుల కధ ఇది. అంతిమ క్షణాల్లో భార్య తో తాను గడిపిన క్షణాల్ని , ఆమెకివ్వలేకపోయిన చిన్న చిన్న ఆనందాల్ని తలుచుకుంటూ ఆమె స్మృతి తో ఆమె కోసమే రాసిన స్మృతి చిహ్నం ఈ గ్రంధం.....