నా సాహిత్యకృషి-గొర్రెపాటి వెంకటసుబ్బయ్యBack to list

గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాసిన అన్ని గ్రంధాలను అవలోకించుకుంటూ తన 80 ఏళ్ల వయసులో రాయలేని స్థితి లో ఉన్నా తన సాహితీ వ్యాసంగాన్ని ఆపలేదు. తుది శ్వాస వరకు రచనలే ప్రపంచం గా బ్రతికారు. పండిత వెంకట సుబ్బయ్య, కవి వెంకట సుబ్బయ్య, ఎర్ర వెంకట సుబ్బయ్య, మధుర జీవి, అని అందరితో  ఎంతో  ఆప్యాయం గా  పిలిపించుకున్న ఆ చరిత్ర కారుని మరో అమూల్య గ్రంధం నా సాహిత్య కృషి. 01.11.1978 న ముందుమాట రాసిన ఈ గ్రంధం సరిగ్గా 33 సంవత్సరాల తర్వాత 01.11.2011 న  e-book గా రూపొందటం ఆయనకి మనమిచ్చే అరుదైన గౌరవం గా భావిద్దాం.