శ్రీ N.G. రంగా విగ్రహావిష్కరణ 1972Back to list

అది 1972 వ సంవత్సరం నవంబరు 9 వ తెదీ , రాష్ట్రంలో ప్రముఖ నాయకుల కార్లన్నీ ఘంటసాల చేరుకున్నాయి. ఆరోజు జరగబోయే వేడుకకి ఎక్కడెక్కడి నుండో అతిధులంతా ఉత్సాహంగా ఘంటసాల గ్రామం చేరుకున్నారు. ఘంటసాల గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారంతా ఆ వేడుక చూడటానికి జలధీశ్వరాలయం ముందుకి చేరుకున్నారు. ఆరోజున ఇద్దరు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. ఒకరు రైతు నాయకుడు శ్రీ N.G. రంగా మరొకరు శ్రీ కిసాన్ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. ఇద్దరూ రైతుల కోసం కృషి చేసిన నాయకులు. ఒకే మాట ఒకే బాట గా నడిచిన గురు శిష్యులు. ఘంటసాల కి చెందిన కిసాన్ వెంకట సుబ్బయ్య గారు రంగా గారికి ప్రధమ శిష్యుడు అత్యంత ఆత్మీయంగా మెలిగిన వ్యక్తీ.  ఈ విగ్రహాల ఆవిష్కరణలో మరో విశేషమేమిటంటే కిసాన్ వెంకట సుబ్బయ్య గారు పరమపదించిన తరువాత అయన విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో అయన గురువు గారైన రంగా గారు జీవించి ఉండగానే ఈ ఇరువురి విగ్రహాలని నెలకొల్పటం.  ఇద్దరూ కూడా కృషి కార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ   నెలకొల్పి కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా నిలబడితే, ఈ విగ్రహావిష్కరణ చేసిన ప్రముఖులంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అవ్వటం మరో విశేషం. ఆరోజుల్లో సాటి నాయకుల పట్ల పార్టీలకతీతంగా ఉన్న గౌరవాభిమానాలకి ఈ ఉదంతం ఒక నిదర్శనం. మొదటిసారి ఏకగ్రీవంగా కాంగ్రెస్ తరపున అవనిగడ్డ శాసన సభకి ఎన్నికై, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న  శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించగా , శాసన మండలి లో ఎం ఎల్ సి గా ఉన్న చిత్తూరు నాయకులు శ్రీ పాతూరి రాజగోపాల నాయుడు (గుంటూరు ఎం పి  గల్లా జయదేవ్ గారి మాతామహుడు ) కిసాన్ వెంకట సుబ్బయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ యడ్లపాటి వెంకటరావు , గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ దోనేపూడి సీతారామయ్య , శాయోజి రావు గారు , మరో శాసన సభ్యులు కనుమూరి సోమేశ్వర రావు గార్లు పాల్గొన్న ఈ సభకి  ఘంటసాల చరిత్ర గ్రంధ రచయిత శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు అధ్యక్షత వహించారు. ఈ రోజు రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలని మరొక్కసారి మననం చేసుకోవటం కోసం అప్పటి ఆంధ్ర పత్రిక చూడండి. 

Dated : 09.06.2020

 

పంచాయితీ ఆవరణలో నేటి విగ్రహాలు 

 

This text will be replaced