Editor Voice

  • ​​ముగిసిన శకం

     ఏరా మనవడా ఎప్పుడొచ్చావ్, ఏరా అల్లుడూ ఏమిటి పిల్లల కబుర్లు , ఇకపై ఊరు వెళ్ళినపుడు ఇలాంటి పలకరింపులు మనకి వినిపించవు. రోడ్డు మీదకి రాగానే కనిపించే ఆ మందుల షాపు ఇక తెరుచుకోదు. అవును,  50 ఏళ్లుగా మన గ్రామస్తుల జీవనంలో పెనవేసుకుపోయిన గోపాలకృష్ణా మెడికల్ ఎంపోరియం ప్రస్థానం ముగిసింది. గ్రామంలో 50 ఏళ్ల క్రితం స్థాపించిన తోలి మందుల షాపు ఇక చరిత్రలోకి వెళ్ళిపోయింది.

    . ...readmore

  • విడిపోయిన జ్ఞాపకాలు

     ఎన్నో భావోద్వేగాల మధ్య రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారికి రాజకీయ నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలు తప్ప సామాన్యుడి ఆవేదన, ఆక్రోశం తెలియకపోవచ్చు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు జరిగిన ప్రాణ నష్టం 68 ఏళ్ల తరువాత ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసును కలచి వేసే ఉదంతం అది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాయి.

    . ...readmore

  • తెలుగు వెలుగు విద్యార్థి

     ఈ ఆర్టికల్ రాయటం కొంచెం ఆలస్యం అయింది.18 ఏళ్లకే ఫేస్బుక్ ని స్థాపించిన మార్క్స్ జుకర్ బెర్గ్ , కాలేజి రోజుల్లోనే గూగుల్ ని స్థాపించిన లారీపేజ్ ల గురించి ఆశ్చర్యంగా, అద్భుతంగా వర్ణించిన ఎన్నో కధనాలు మీరు చదివి ఉంటారు. కాని ఇవన్నీ సమాచార విప్లవం వచ్చాక గత 15 ఏళ్లలో జరిగిన విషయాలు. 60 ఏళ్ల క్రితం మన ఘంటసాల హైస్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి తన 20 ఏళ్ల వయసులో స్థాపించిన ఓ మాస పత్రిక గురించి, 61 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఆ పత్రిక జైత్రయాత్ర గురించి , ఆ విద్యార్ధి గురించి రాయాలని చాలా సార్లు అనుకున్నాను.

    . ...readmore

  • ​బడ్డీ నాగయ్య ​

     మన గ్రామం తర్వాత నాకు అదే స్థాయి అనుబంధం ఉన్న గ్రామం, పొరుగున ఉన్న  కొత్తపల్లి. మా అమ్మగారిది అదే ఊరు కావటం, చిన్నపటినుండి ప్రతి ఆదివారం సెలవు వస్తే అమ్మమ్మ వాళ్ళింటికి పరిగెత్తటం ఆ ఊరుతో నా అనుభందాన్ని మరింత బలపడేట్టు చేసింది. చిన్నపుడు ఎన్నో ఆదివారాల ఆటవిడుపులు, కోతి కొమ్మచ్చి, శివాలయంలో ఆడుకున్న పొగడ చెట్టు నీడ, కింద పడితే ఏరుకున్న పొగడపూలు,1990 లో తుఫానుకి ఆ చెట్టు పడిపోతే ఆ వంగిన కొమ్మ మీద ఊగిన ఉయ్యాల. పూజారి జగం గారి మంచి నీళ్ళ పంపు, 

    . ...readmore

  • నాలుగేళ్ళ ప్రయాణం

     వెబ్ సైట్ ప్రారంభించి నేటికి నాలుగేళ్ళు గడిచాయి. ఇది ఇంత కాలం మనగలుగుతుందని, ఇంతమంది అభిమానాన్ని చూరగొంటుందని నేనూ అనుకోలేదు. 2013 సంవత్సరాన్ని ఒక సారి సింహావలోకనం చేసుకుంటే, వార్తా విశేషాలన్నీ ఎప్పటికప్పుడు అందించినా ఉద్యోగరీత్యా దేశాలు మారటం వల్ల కధనాలు మరియు ఎడిటర్ వాయిస్ క్రమం తప్పకుండా రాయలేకపోయాను.

    . ...readmore

  • రోడ్డు మీది - పేరు మీది

    ఈ మధ్య ఒకే తరహా ఆలోచనలు కలిగిన మూడు అనుభవాలు నాకు ఎదురయ్యాయి. ఎలాగూ తెలంగాణా విడిపోయింది, కానీ మన వాళ్ళకి మాత్రం హైదరాబాదు మీద మమ కారం మాత్రం పోవట్లేదు. మిగతా తెలంగాణా జిల్లాల మీద ప్రేమ ఉన్నా లేకపోయినా హైదరాబాదు మీద మాత్రం ఎనలేని భావోద్వేగాలు పెనవేసుకుని ఉన్నాయి. వాళ్ళు పొమ్మంటున్నా మనకి మాత్రం ఎందుకో దానిని వదులుకోవటం ఇష్టం లేదు. మానసిక పరమైన అనుభంధం ఒకటైతే మళ్ళీ కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే అయ్యే ఖర్చు కొత్తగా ఏర్పడే రాష్ట్రం మీద పడుతుందని ఆర్ధిక నిపుణులు, మేధావుల ఆందోళన మరో కారణం.

    . ...readmore

  • వందేళ్ళ పంచాయితీ

     గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు అనే అవగాహన వచ్చాక నేనెరిగిన మొదటి వ్యక్తి శ్రీ సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారు.1988 నుండి 1995 వరకు మన గ్రామానికి సర్పంచ్ గా ఆయన సేవలందించారు. అప్పటికి 75 సంవత్సరాల ఘంటసాల గ్రామ పంచాయితీ చరిత్రలో తొలి కమ్మేతర సర్పంచ్ ఆయనే. అప్పటిదాకా 10 మంది కమ్మ సామాజిక వర్గం నుండే ఈ పదవికి ప్రాతినిధ్యం వహించారు. సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారి హయాంలో నేను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమైన కార్యక్రమాలు రెండు. ఒకటి మంచినీళ్ళ టాంక్ ప్రారంభోత్సవం. రెండు పంచాయితీ వజ్రోత్సవాలు. 1993 నాటికి పంచాయితీ ఏర్పడి 75 సంవత్సరాలు కావటంతో ఆ వేడుకలని వైభవంగా నిర్వహించారు. 

    . ...readmore

  • నా ఐరోపా యాత్ర

     ఖతర్ నుండి వేరే విమానంలో ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళాలి. ఆ ఫ్లైట్ కి ఇంకా మూడుగంటల సమయం ఉంది. ఖతర్ విమానాశ్రయం చాలా పెద్దది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకి ఇక్కడినుండి విమానాలు ఉన్నాయి. ఆసియా దేశాలనుండి అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకి  వెళ్ళే ప్రయాణీకులకి ఇది జంక్షన్. ఇక్కడే ఎక్కువ మంది ఫ్లైట్ మారాల్సి ఉంటుంది. ఖతర్ కరెన్సీ పేరు రియాల్. ఒక్క రియాల్ కి మన డబ్బుల్లో 16 రూపాయలు వస్తాయి. మనం మారే ఫ్లైట్ కి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటె ఎయిర్ పోర్ట్ లోనే వీసా తీసుకుని బయటకి వెళ్లి చూసి రావచ్చు. గల్ఫ్ దేశాల్లో ఫోన్ చార్జీలు చాలా ఎక్కువ. 30 రియాల్స్ తో ఒక ఫోన్ కార్డ్ తీసుకుంటే పబ్లిక్ ఫోన్ నుండి 16 నిమిషాలు ఇండియాకి మాట్లాడవచ్చు. అమెరికా డాలర్ కి పోటీగా యూరో ని ప్రవేశపెట్టాక, అన్ని చోట్ల యూరో కూడా కామన్ కరెన్సీగా వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు కరెన్సీ లు చెల్లుబాటు అవుతాయి. 

    . ...readmore

  • పారిస్ లో మనఘంటసాల

     పారిస్ అనగానే ముందు గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. అక్కడికి వెళ్లేముందు ఈఫిల్ టవర్ చూడబోతున్నామనే ఉత్సుకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని గత వారం పారిస్ వెళ్తున్నా అనుకోగానే నేను ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యింది మాత్రం ఈఫిల్ టవర్ కోసం కాదు. అక్కడ ఉన్న గుయ్ మెట్ అనే మ్యూజియం చూడాలి అని. దీని వెనుక కధ తెలియాలంటే 90 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1923 లో గ్రామ రైతు కోట దిబ్బల దగ్గర పొలం దున్నుతుండగా పాలరాతి శిల్పాలు బయట పడ్డాయి. అప్పట్లో ప్రజలకు అవగాహన లేక దొరికిన ఇలాంటి శిల్పాలన్ని అక్కడక్కడా గుట్టలుగా వేసి పెట్టేవాళ్ళు. కొంతమంది వాటిని బట్టలు ఉతుక్కునే బండలుగా వాడేవారు.

    . ...readmore

  • కమ్మవారంతా చౌదర్లేనా ???

     చాలా కాలం నుండి నా మనసులో ఉన్న ప్రశ్న ఇది. నాకు సమాధానం దొరికి చాలా రోజులే అయినా ఇప్పటివరకూ ఎక్కడా చర్చించాల్సిన అవసరం రాలెదు. మొన్నామధ్య గ్రామానికి వెళ్ళినప్పుడు విజయవాడలో ఇంజినీరింగ్ చదువుకునే మా బంధువుల అబ్బాయిని ఇంటికి ఆహ్వానిస్తే, తనకి C పార్టీ ఉంది కాబట్టి అది అయ్యాక వస్తాను అని చెప్పాడు. అంటే కాలేజి లో ఉన్న కమ్మ విద్యార్ధులు మాత్రమే జరుపుకునే పార్టీ అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇటీవల గ్రామానికి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దల దగ్గర దగ్గర ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు, నాకు ఉన్న సందేహాలు పూర్తిగా నివృత్తి అయ్యాక అందరికీ కూడా ఇది తెలిస్తే బావుంటుంది అనిపించింది. 

    . ...readmore

  • ఈ పిల్లాడికి పెళ్లవుతోంది

    ప్రియమైన మిత్రులు,శ్రేయోభిలాషులు,ఆప్తులు,వీక్షకులకి,


    మీలో చాలామందికి నాకూ ప్రత్యక్ష పరిచయాలు లేకపోవచ్చు.కొంతమందిని అసలు నేను చూసి కూడా ఉండకపోవచ్చు. కొంతమందికి అసలు నేనెవరో కూడా తెలియకపోవచ్చు. కాని మూడు సంవత్సరాలుగా ఈ వేదిక మిమ్మల్నందరినీ నాకు దగ్గర చేసింది. ఇన్ని రోజులూ ఒంటరిగా సాగిన నా జీవిత ప్రయాణం 2013 ఫిబ్రవరి 14 న జంటగా మారబోతోంది. ఈ శుభవేళ మీ అందరి ఆశీస్సులు నాతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని నాకు ఆప్తుల్ని చేసిన ఇదే వేదిక ద్వారా నా వివాహానికి మీ అందరికీ ఆహ్వానం పలకటం సంతోషంగా ఉంది. ఈ ఆహ్వానం చూసిన ప్రతి ఒక్కరూ విచ్చేసి మీ ఆశీస్సులు అందచేయాలని ప్రార్ధన.
    . ...readmore