Editor Voice

  • ఆకాశానికి ఆధారం

    ఒకసారి ఒక వ్యక్తి కి ఒక సందేహం వచ్చింది. చిన్న పందిరి నిలబడాలన్నా నాలుగు స్తంభాలు కావాలి కదా, మరి అంత పెద్ద ఆకాశం ఎటువంటి ఆధారం లేకుండా ఎలా నిలబడింది అని. సత్యాన్వేషణ కోసం తపస్సు చేసాడు. దేవుడు ప్రత్యక్షమవగానే తన సందేహాన్ని అడిగాడు. అప్పుడు భగవంతుడు ఒక 100 ఇళ్ళకి భిక్షాటన కి వెళ్లిరా, ఆ తర్వాత నీ సందేహానికి సమాధానం చెప్తాను అని చెప్పాడు. కానీ భిక్ష అడిగేటప్పుడు కోపం గా తిడుతూ అడుగు అని చెప్పి పంపాడు. అలాగే అని ఆ వ్యక్తి భిక్షాటన కి బయలుదేరాడు.

    . ...readmore

  • లయోలా మోడల్ కాన్వెంట్

     1982 కి ముందు ఊరిలో ఏ పిల్లవాడినైనా ఎక్కడ చదువుతున్నావురా అని అడిగితే చెరువు మీద బడి, కొత్తరాజా గారి బడి, మేడ మీద బడి, 6 వ తరగతి అయితే హైస్కూల్.. ఈ పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ 1982 తర్వాత మరో కొత్త జవాబు తోడయ్యింది. అదే లయోలా మోడల్ కాన్వెంట్. ఎవరైనా ఎక్కడ చదువుతున్నావురా  అడిగినపుడు కొంచెం ఛాతి విశాలంగా చేసుకుని, సాగదీసి మరీ చెప్పేవాళ్ళు లయోలా మోడల్ కాన్వెంట్ అని. మన గ్రామం లో అదో కొత్త పిలుపు, ఇంగ్లిష్ మీడియం విద్య ని గ్రామస్తులకు పరిచయం చేసిన ఒక మేలి మలుపు.

    . ...readmore

  • రామయ్య కొట్టు

     నాలాగే చాలా మంది చిన్నపుడు అమ్మ ఇచ్చిన సరుకుల చీటీ, చేతి సంచి పట్టుకుని చాలా మంది వెళ్ళిన కిరాణ షాపు రామయ్య గారిదే. కొంచెం పాత తరం వాళ్ళకి అది గెల్లి పిచ్చియ్య గారి కొట్టు. అసలు ఆ సెంటర్ పేరే రామయ్య కొట్టు ,ఏ వీధికి వెళ్ళాలన్నా అదే లాండ్ మార్క్. రామయ్య కొట్టు నుంచి కుడి చేతి వైపుకో ఎడమ చేతి వైపుకో తిరగమని అడ్రస్ చెప్తారు.

    . ...readmore

  • పెద్దలారా మన్నించండి

    పంజాబ్ లో బార్బర్ షాప్ పెట్టి దివాలా తీసిన వాడి మొహం నువ్వూను.. జంధ్యాల సినిమాలు చూసిన వాళ్ళందరికీ పరిచయమైన తిట్టు. కానీ అది కామెడీ..ఇప్పుడు ఆ కామెడీ నే ఒక ట్రాజడీ కి ఉపమానం గా తీసుకోవటం బాధ గానే ఉన్నా అంతకుమించి న వాక్యం నాకు దొరకలేదు.గ్రామాల్లో వృద్ధాశ్రమం కూడా అలాంటిదే అనే భావన ఉండేది నాకు. ఉపిరి సలపని ఒత్తిడి ,భార్య భర్త ఇద్దరు పిల్లలతో తీరిక లేక ,పెద్దవాళ్ళని భరించలేక ,వారి అవసరాలని చూడలేక నగరాల్లో పెద్ద వాళ్ళని ఆశ్రమాల్లో చేరుస్తుంటారు.

    . ...readmore

  • గ్రంధాలయ రధసారధి

    మన ఊరి గ్రంధాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు నిజానికి అది నాకొక బడి,స్నేహితుడిలాంటిది. నా చిన్నపుడు 8 వ తరగతి చదువుతున్నపుడే  గ్రంధాలయంలో అడుగు పెట్టానని తెలుసు.

    . ...readmore

  • ఆఖరి హత్య

     1988 - 89 ప్రాంతాల్లో మా ఇంట్లో ఒక ఫోటో ఉండేది,తర్వాత చూస్తే మరికొందరి ఇళ్ళకి వెళ్ళినపుడు కూడా ఆ ఫోటో కనిపించేది.ఎప్పుడైనా గుడికి వెళ్ళినపుడు గుడి ముందున్న  ఒక స్మారక స్తూపం లోనూ మళ్లీ అదే ఫోటో, అప్పుడు నాకు అయిదేళ్ళు. చాలా కాలం ఆ ఫోటో నన్ను వెంటాడింది.ఆయనెవరో నాకు తెలీదు ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు కూడా. కానీ ఆ ఫోటో మాత్రం ఇప్పటికీ ఉరిలో ఎక్కడోచోట నాకు కనిపిస్తూనే ఉంటుంది.కొంచెం ఊహ తెలిసాక ఎవరో ఒక పెద్దాయన్ని అడిగాను ఆయనెవరు అని, సమాధానం తెలిసింది. కానీ అది ఇప్పుడు అప్రస్తుతం.

    . ...readmore

  • విలక్షణ క్షణాలు

     జలుబు చేసినపుడు తుమ్ము వస్తే చిరంజీవ అంటారు పెద్దవాళ్ళు ,కానీ మన ఊర్లో మాత్రం చిరంజీవ తో పాటు ఇంకో మాట కూడా అనటం అలవాటు,గోపాలకృష్ణ తాత దగ్గర మందు బిళ్ళ తెచ్చుకో అని. చిన్నపాటి దగ్గు జలుబు వస్తే ముందు గుర్తొచ్చే పేరు మందులషాపు గోపాలకృష్ణ. నా మటుకు నేను ఆరోగ్యం బాగోలేనపుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలకంటే గోపాలకృష్ణ తాత దగ్గరికి వెళ్ళిన సందర్భాలే ఎక్కువ. నాకే కాదు ఊర్లో పెరిగిన చాలామందికి కూడా ఇదే అలవాటు. ఎప్పుడూ తెల్లటి పాంటు, షర్టు ,పచ్చటి వర్చస్సు ,చిరాకు కనపడని మోము ,చిరునవ్వుల పలకరింపు,చిన్నవాళ్ళని మనవడా అని అప్యాయం గా నూ,వరుస అయిన వాళ్ళని అల్లుడూ పలకరించే గోపాలకృష్ణ తాత అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ,గౌరవం.

    . ...readmore

  • గత వైభవానికి మూగ సాక్ష్యం

      నేడే చూడండి.. మీ అభిమాన ధియేటర్ రాజ్యలక్ష్మి డీలక్స్ లో ప్రతి రోజూ మూడు ఆటలు..ఆ మైక్ వినిపిస్తే  చెవులు రిక్కిరించుకుని వినేవాళ్ళు అందరూ..రిక్షా వస్తుంటే  పోస్టర్ అంటిస్తుంటే పిల్లలంతా గుమిగూడి పోస్టర్ ని తదేకం గా గమనించే వాళ్ళు.ఇక ఆ రిక్షా రాక  ,ఆ మైక్ వినిపించక రెండేళ్ళు అయ్యింది.బహుశా ఇక వినిపించక పోవచ్చు..ఆ రిక్షా కనిపించక పోవచ్చు. నాకు ఊహ తెలిసాక నాకు గుర్తున్న సినిమా బాలభారతం 1989 లో అనుకుంటా.నేల టికెట్ నుంచి బాల్కనీ దాకా అన్నీ క్లాసుల్లో ను కూర్చుని సినిమా చూసిన రోజులున్నై

    . ...readmore

  • మన ఊరి మానస పుత్రిక

    ప్రతి కధ ఎక్కడో చోట మొదలవ్వాల్సిందే. నారదుడ్ని వాల్మీకి ఈ లోకం లో కెల్లా ఉత్తముడు ఎవరు అని అడగటం తో రామాయణం మొదలైంది. సూత మహర్షి తన శిష్యులకు మాటల మధ్య లో చెప్పిన కధ తో మహా భారతం మొదలైంది. ఈ వెబ్ సైట్ కధ ఓ ఉదయం ముత్యాలమ్మ గుడి ఆవరణ లో మొదలైంది. దీనికి స్పూర్తి నిచ్చిన వాడు గొర్రెపాటి మోహన కృష్ణ.

    . ...readmore

  • నిర్లక్ష్యం నీడన విశ్వేశ్వరాలయం

    గ్రామం లో ఉన్న ప్రతి ఆలయానికి ఏదో ఒక విశిష్టత ఉంది. ఒకప్పుడు ఎంతో వైభవానికి నోచుకున్న విశ్వేశ్వరాలయం, నేడు పట్టించుకునే వారే లేక వెల వెల పోతోంది.కనీసం ధూప దీప నైవేద్యాలకి సైతం ఎవరికోసమో ఎదురు చూడాల్సిన పరిస్థితి.

    . ...readmore