మన హైస్కూల్ Back to list

 మన హైస్కూల్

 దేశ స్వాతంత్ర సముపార్జనకి సరిగ్గా సంవత్సరం ముందు 24-08-1946లోమాధ్యమిక పాఠశాలగా ఈనాటి మన హైస్కూల్ ప్రారంభమైంది. గొట్టిపాటి బ్రహ్మయ్య గారి అవిరళ కృషి ఫలితం గా,ఘంటసాల మరియు ఘంటసాల పాలెం వాసుల సంయుక్త భాగస్వామ్యం తో 10000/- రూపాయల ఖర్ఛు మరియు 10 ఎకరముల భూ వితరణ తోనూ దీనిని ప్రారంభించారు .తొలి సంవత్సరం విధ్యార్ధుల సంఖ్య 250.ఇందులో ఘంటసాల వాళ్లు 180 మంది.మిగిలింది చుట్టుపక్కల గ్రామాల విధ్యార్ధులు.

ఎంతో మందినివిద్యావంతులుగానూ,మేధావులుగానూ తయారు చేసిన ఘనత ఈ పాఠశాలది.శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు,వారి సోదరులు మరియు ఉద్యోగాల్లోనూ,వ్యాపారాల్లోను, విదేశాలలోను రాణిస్తున్న ఎంతో మంది మన ఊరి వాళ్లు ఈ స్కూల్ విధ్యార్ధులే.  1950 లో దీనిని హైస్కూల్ గా మార్చారు.