కె ఎన్ ఆర్ ఆకస్మిక మృతి Back to list

 

మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వై ఎస్ ఆర్ సిపి నాయకులు శ్రీ కుక్కల నాగేశ్వరరావు గారు కొద్ది సేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు. గతం లో ఆయన కాంగ్రెస్ తరపున కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసారు. జలదీశ్వరాలయం ముందు సిమెంట్ రోడ్డు, కళామందిరం ఆయన హయాంలోనే జిల్లా పరిషత్ నిధుల నుండి కేటాయించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్టణం ఎం పీ స్థానానికి వై ఎస్ ఆర్ సిపి తరపున అభ్యర్ధిగా ఆయన పేరు ఖరారు అయినట్లు ప్రచారం లో ఉంది. శ్రీ నాగేశ్వరరావు గారి స్వగ్రామం కోసూరు.

Dated : 21.11.2013