శ్రీమతి వేమూరి విశాలక్ష్మి అస్తమయంBack to list

శ్రీమతి  వేమూరి విశాలక్ష్మి అస్తమయం

నా తల్లి వేమూరి విశాలక్ష్మి (కి||శే వేమూరి చినరామయ్య గారి భార్య) 92 సంవత్సరాల సుదీర్ఘ, సుందర జీవితం ముగించుకుని 2-2-2013 శనివారం ఉదయం పరమపదించింది. విశాలక్ష్మి అక్కయ్య గా, విశాలక్ష్మి వదిన గా, విశాలక్ష్మి అత్తయ్య గా, ఇసంమామ్మ గా, ఇలా ఎన్నో పేర్లతో ఎంతమందితోనో తన జన్మస్థలం గోగినేనిపాలెం లోనూ దీర్ఘకాలం గడిపిన తన మెట్టినిల్లు ఘంటసాలపాలెం లోనూ, ఒక్కడే కొడుకైన నాతో చెన్నై లోనూ, హైదరాబాద్ లోనూ తనకి పరిచయం అయిన ప్రతి వ్యక్తి చేతా దిష్టి తగిలెంతగా ప్రేమించబడి, అభిమానించబడి అత్యంత సంతృప్తికర జీవితం గడిపిన ఆ తల్లి బిడ్డగా నేనెంతో గర్వపడుతున్నాను. మాకు తెలిసిన నలుగురికీ ఈ వార్త ను దుఖం తో కాక ప్రశాంతమైన  మనసుతోనే తెలియచేస్తున్నాను. నా తల్లి మరణానంతర క్రతువులను దిగులుతో కాక ఒక పండుగలా జరుపుకుంటున్నాము (Iam not mourning her death, but celebrating her life) ఎందుకంటే అంతటి పరిపూర్ణ జీవితం ఆమెది.

 వేమూరి సత్యనారాయణ

Mobile: 98483-21703

 

 

వేమూరి సత్యనారాయణ గారు ఘంటసాల పాలెం గ్రామస్థులు.గత 30 సంవత్సరాలుగా పత్రిక,మరియు సినిమా రంగాల్లో రచయిత మరియు ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. స్వాతి పత్రిక వ్యవస్థాపకుల్లో వేమూరి గారు ఒకరు.తదనంతరం సినిమా రచన మరియు నిర్మాణ రంగాల వైపు మళ్ళారు. 

కుడి వైపు చివరి వ్యక్తి


 

 

Dated : 05.02.2013