రుద్రభూమి అభివృద్ధి సమీక్షా సమావేశంBack to list

 

రుద్రభూమి అభివృద్ధి సమీక్షా సమావేశం గ్రామస్తులంతా పాల్గొనగా 22.04.2012 న సంత మార్కెట్ ఆవరణ లో జరిగింది. ముఖ్య అతిధిగా గుంటూరు మోడల్ స్మశాన వాటిక నిర్వాహకులు శ్రీ దాసరి హనుమంతరావు గారు విచ్చేసి పలు విలువైన సూచనలు చేశారు. గొర్రెపాటి విద్యా ట్రస్ట్ అధినేత శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ మూల్పూరి చెన్నారావు,శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ,శ్రీ బండి పరాత్పరరావు,శ్రీ వేమూరి ప్రసాద్,శ్రీ వేమూరి వెంకట్రావు, శ్రీ అయినపూడి విజయకుమార్,శ్రీ దిరిశం బాల కోటయ్య,మాజీ గ్రామ సర్పంచ్ శ్రీ అందె జగదీశ్, తదితరులు తమ విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భం గా స్మశాన అభివ్రద్ధి కి చొరవ చూపటమే కాకుండా మొత్తం ఖర్చులో సగం భరించటానికి ముందుకు వచ్చిన వీరపనేని సుబ్రహ్మణ్యం,ఆనంద్ సోదరుల దాతృత్వాన్ని వక్తలంతా కొనియాడారు. వారి తరపున మేనమామ అయిన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు గొర్రెపాటి విద్యా ట్రస్ట్ ఆధ్వర్యం లో ఈ నిర్మాణం కొనసాగుతుందని సభికుల హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు. గ్రామస్తులు, ప్రవాస గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వితరణని అందించటం ద్వారా రుద్రభూమి అభివృద్ధి కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ వేమూరి విశ్వేశ్వరరావు గారు ప్రసంగిస్తూ,యాభయి ఏళ్ల క్రితం ప్రస్తుతం ఉన్న దహన మందిరాన్ని,విశ్రాంత మందిరాన్ని నిర్మించిన వేమూరి రాజగోపాలస్వామి గారిని చరిత్ర మరవదు అన్నారు. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వీరపనేని సోదరులు తలపెట్టిన ఈ యజ్ఞం విజయవంతం అవ్వటానికి గ్రామస్తులతోపాటుగా తన సహాయ సహకారాలు అందచేస్తానని సభాముఖం గా ప్రకటించారు. జననం లాగే మరణం కూడా అందమైనదే అని, ఈ దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో జరిగిన కొన్ని అంతిమ సంస్కారాలని ఉదహరించారు. సమర్ధుడైన కొడుకు ఉంటే అంతిమ సంస్కారం అనేది ఆ తల్లి దండ్రుల గొప్పతనాన్ని, వారి జీవిత కాలపు విశేషాల్ని చిరస్థాయిగా నిలబెడుతుందని చెప్పారు. మన గ్రామ విషయానికి వస్తే తాను చూసిన అంతిమ సంస్కారాల్లో చిరస్మరణీయమైనవి గొర్రెపాటి బుల్లియ్య చౌదరి గారిది మరియు ఇటీవల జరిగిన రంగనాధబాబు గారి తండ్రి వెంకట్రాయులు గారిది అని చెప్తూ ఈ ఇద్దరి విషయంలో స్త్రీ భేదం, వయోభేదం, లేకుండా గ్రామస్తులంతా అంతిమ యాత్రలో పాల్గొన్న జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ఆ స్థాయిలో అంతిమయాత్ర జరిగినా, చివరి మజిలీ రుద్రభూమికి వచ్చేటప్పటికి దుర్ఘంధంతో కూడిన బహిర్భూమిలో సంస్కారాలు కావించాల్సి వచ్చిందని వాపోయారు. ఇక ఈ బృహత్కార్యాన్నితన భుజ స్కందాలపై వేసుకున్న జడ్పీ మాజీ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ మాట్లాడుతూ డిసెంబర్ 2013 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలియచేసారు.ఈ సందర్భంలో కొంతమంది సభాముఖం గా తమ విరాళాలని ప్రకటించారు.

మూల్పూరి చెన్నారావు - 10000/-
అందె జగదీశ్ - 10000/-
దిరిశం బాల కోటయ్య - 10000/-
గొర్రెపాటి లీలాక్రిష్ణయ్య - 5000/-
బండి పరాత్పర రావు - ఏదైనా ఒక భాగం అభివ్రద్ది
 
గుంటూరు స్మశాన నిర్వాహకులు శ్రీ దాసరి హనుమంతరావు 
 
 
Dated : 25.04.2012