మన ఊరి మానస పుత్రిక Back to list

మన ఊరి మానస పుత్రిక

 ప్రతి కధ ఎక్కడో చోట మొదలవ్వాల్సిందే. నారదుడ్ని వాల్మీకి ఈ లోకం లో కెల్లా ఉత్తముడు ఎవరు అని అడగటం తో రామాయణం మొదలైంది. సూత మహర్షి తన శిష్యులకు మాటల మధ్య లో చెప్పిన కధ తో మహా భారతం మొదలైంది. ఈ వెబ్ సైట్ కధ ఓ ఉదయం ముత్యాలమ్మ గుడి ఆవరణ లో మొదలైంది. దీనికి స్పూర్తి నిచ్చిన వాడు గొర్రెపాటి మోహన కృష్ణ. ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఆర్కుట్ లో ఘంటసాల కమ్యునిటీ ఓనర్ ఇతనే. ఊరు ని ఇంటర్ నెట్ లో పాపులర్ చెయ్యాలనే అతని తపన నన్నెంతగానో ఆకట్టుకునేది.ఆ క్రమం లోనే తన తండ్రి తో కలిసి ముత్యాలమ్మ గుడికి వచ్చిన మోహన కృష్ణ,  ఫోటో లు తీస్తుండగా తన తపన ఏమిటో అర్ధం అయ్యింది. అప్పటికి ఆర్కుట్ లో కమ్యునిటీ ల్లో ఫోటో స్ అప్ లోడ్ చేసే సౌకర్యం లేదు.ఇదే పనిని మరింత విస్తృతం గా మనమెందుకు చెయ్యకూడదు అనే ఆలోచనలోనుంచే పుట్టుకొచ్చిందీ వెబ్ సైట్. ఆ తరువాత వికీ పిడియా లో రాసిన ఒక వ్యాసం నన్ను మరింత ఆలోచింప చేసింది. ఇది రాసిన వ్యక్తి గెల్లి రామరాజు.అప్పటికే మండలం మొత్తానికి కలిపి ఒక వెబ్ సైట్ రూపొందించటానికి కొందరు ప్రయత్నించినా అది కార్యాచరణ కి నోచుకోలేదు.కేవలం వార్తలని మాత్రమే  చెప్పేది గా వెబ్ సైట్ ఉండకూడదు అనేది మా ఆలోచన.చారిత్రకం గా ప్రసిద్ది చెందిన గ్రామ విశేషాలని పొందు పరిస్తే  అవి ముందు తరాలకి కూడా ఉపయోగ పడతాయి అనే ఆలోచన తోనే దీనిని ప్రారంభించాం. అప్పుడే ఏడాది గడిచింది.ఈ సందర్భం గా నాకంటే వయసులో చిన్న వాళ్లయినా మోహన కృష్ణ ,రామరాజులకి కృతజ్ఞత లు చెప్పటం నా కనీస ధర్మం. 2009 జనవరి లో మొదలు పెట్టిన ఈ సైట్ పూర్తి కావటానికి పట్టిన సమయం సరిగ్గా సంవత్సరం. 2010 జనవరి 14 న గొర్రెపాటి రంగనాధ బాబు గారి చేతుల మీదుగా గ్రామ నడిబొడ్డున సగర్వం గా ప్రారంభించాం.

 ఒక పక్క ఉద్యోగ భాధ్యత లు నిర్వహిస్తూనే ప్రతి ఆదివారం విషయ సేకరణ కి కేటాయిస్తూ ప్రతి అంశం ప్రామాణికం గా ఉన్న తర్వాతనే వెబ్ సైట్ లో చేర్చటం జరిగింది.ఈ ప్రయాణం లో నేను కలిసిన ఎంతో మంది పెద్దలు ,వయోదికులు ,కాకలు తీరిన కమ్యునిస్టులు ,చరిత్రకారుల నుంచి నేను నేర్చుకున్న విషయాలు ,తెలుసుకున్న   సంగతులు ఏ యూనివర్సిటీ లో ను చెప్పని పాఠాలు.ఇక ఆర్ధికం గా వెన్ను దన్నుగా నిలబడిన వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ పేజి సరిపోదు.నా చిన్ననాటి మిత్రులు,అప్పటివరకు నన్ను చూడని వాళ్ళు సైతం విరాళాలు పంపి తమ సహృదయత ని చూపించారు.వారి వివరాలు our team పేజి లో చూడవచ్చు.


                       ఇక ఈ సంవత్సరం పొందు పరచనున్న E- BOOKS తో  వెబ్ సైట్ ధ్యేయం నెరవేరినట్లే నని భావిస్తూ. దీనికి సహకారం అందించిన శ్రీ గాజుల చంద్రశేఖర్  గారికి, గొర్రెపాటి రవిసుదాకర్,కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ గారికి ,గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.యవ్వనం లో కవిత్వం రాయాలి , వృద్ధాప్యం లో విమర్శలు రాయాలి అని ఎక్కడో చదివిన గుర్తు.ఎన్నో ఆర్టికల్స్ ,వార్తలు పొందు పరచినా ఈ సంవత్సరం అత్యధికులు చదివిన ఆర్టికల్ ఈ పిల్లాడికి పెళ్లవుతుందా??? దీనికి ముందు తర్వాత ఎన్ని రాసినా అన్నిటిని తోసి రాజని Best Artical of the Year గా నిలబడింది.

Dated : 10.01.2011

 

 

This text will be replaced