ఆరంభ శూరత్వంBack to list

 

ఆరంభ శూరత్వం

 

ఎవరికైనా మంచి ఉద్యోగం వస్తే ముందుగా వాళ్లకి కంగ్రాట్స్ చెప్తాం. ఆ తరువాత తీరుబడి గా మిగతా విషయాలన్నీ తెలుసుకుంటాం. కానీ నాకీ మధ్య కొన్ని ఆశ్చర్య కరమైన అనుభవాలు ఎదురయ్యాయి. గత ముప్పై ఎనిమిది వారాలుగా ఎడిటర్ వాయిస్ రాస్తున్నా.ఈ మధ్య నాకు పోలాండ్ లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం రావటంతో ఆ సంతోషాన్ని సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పంచుకున్నాను. అది అలా అలా అందరికి తెలిసి కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగిన మొదటి ప్రశ్న, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే వెబ్ సైట్ పరిస్థితేంటి? ఎడిటర్ వాయిస్ ఎవరు రాస్తారు? దీనికి ఏం సమాధానం చెప్పానో తర్వాత చెప్తాను. అసలు నాకు జాబ్ వస్తే కంగ్రాట్స్ చెప్పటం మానేసి వెబ్ సైట్ గురించి అడుగుతున్నారు ఏమిటీ అని ఎదురు ప్రశ్న వేసాను. నీకు కంగ్రాట్స్ దేముందయ్యా ముందు వెబ్ సైట్ సంగతి చెప్పు అని మళ్లీ అదే ప్రశ్న. బయటకి చెప్పలేదు గాని నేను యూరప్ వెళ్తున్నాననే ఆనందం కంటే, జీవితంలో అత్యంత సంతొషంగా ఫీల్ అయిన సందర్భం ఇది. ఇప్పటిదాకా నా వృత్తి ఉద్యోగం, ప్రవృత్తి వెబ్ సైట్ గానే భావించాను. నా వృత్తి నాకు ఆర్ధిక సంతృప్తిని ఇస్తే, ప్రవృత్తి ఆత్మ సంతృప్తిని ఇచ్చింది. మొన్న మా టీం మెంబర్ నాంచారయ్య వివాహానికి హాజరైనప్పుడు బెంగళూరు లోఉద్యోగం చేసే గోర్రిపర్తి శ్రీనివాస్ కలిసి ఇంత ఓపిక ఎక్కడుంది నీకు అని ఆశ్చర్య పోయాడు.

అమెరికాలో ఉండే నా సోదరి అయినపూడి కల్యాణి మాట్లాడుతూ శనివారం వస్తే మొబైల్ వంక ప్రతి నిమిషం చూస్తూ ఉంటా అన్నయ్యా, ఈ వారం నువ్వేం రాస్తావా, ఇంకా మెయిల్ రాలేదు అని. అంత ప్రాముఖ్యత కలిగిన విషయాలుగా ఎవరు భావించని ఎన్నో అంశాలు ఈ వెబ్ సైట్ పెట్టాక ప్రాముఖ్యత సంతరించుకున్నాయని చాలా మంది మెయిల్స్ చేస్తుంటారు.అయితే ఇంతమంది అంత ఆసక్తిగా ఎదురు చూస్తారనే విషయం తెలిసాక నా భాధ్యత మరింత పెరిగిందని మాత్రం అర్ధం అయ్యింది. ఆంధ్రులు ఆరంభశూరులు అని ఒక నానుడి. నేను ఇండియా లో లేకపోయినా ఇది ఆరంభ శూరత్వం గా మిగిలిపోకూడదని నా ఆశ. అందుకే ఇక నుంచి ఈ వెబ్ సైట్ కి మీరే రిపోర్టర్. మీకు తెలిసిన వార్తలని , అంశాలని మెయిల్ చెయ్యండి. లేదా మీ ఫోన్ నంబర్ ని మెయిల్ చేసినా నేనే కాల్ చేసి వివరాలని పొందు పరుస్తాను. అంతే తప్ప ఈ వెబ్ సైట్ ఆరంభ శూరత్వం గా మిగలకూడదని నా కోరిక.

దీనికి మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ....మీ రాజేష్ వేమూరి 
 
ఇక నన్ను అడిగిన వాళ్ళకి నేను చెప్పిన సమాధానం. ఇప్పటిదాకా ఘంటసాల వెబ్ సైట్ హైదరాబాదు నుంచే నిర్వహించబడింది. ఇప్పుడు పోలాండ్ నుంచి నిర్వహించబడుతుంది.
 
My Number 0048661340301
 
Dated : 13.05.2012
 

 

This text will be replaced