నిర్లక్ష్యం నీడన విశ్వేశ్వరాలయం Back to list


 

నిర్లక్ష్యం నీడన విశ్వేశ్వరాలయం 

గ్రామం లో ఉన్న ప్రతి ఆలయానికి ఏదో ఒక విశిష్టత ఉంది. ఒకప్పుడు ఎంతో వైభవానికి నోచుకున్న విశ్వేశ్వరాలయం, నేడు పట్టించుకునే వారే లేక వెల వెల పోతోంది.కనీసం ధూప దీప నైవేద్యాలకి సైతం ఎవరికోసమో ఎదురు చూడాల్సిన పరిస్థితి.ఇక అర్చకుల జీతమైతే నెలకి కేవలం 500 రూపాయలు.ఒకప్పుడు తెప్పోత్సవాలతో ఊరేగిన శంకరుడు నేడు భక్తుల నిరాదరణ తో కనీస పూజాదికాలకు కూడా నోచుకోలేక పోతున్నాడు.ఒక పక్క జలధీశ్వరాలయానికి పెరుగుతున్న ఆదరణ వల్ల కూడా ఈ ఆలయానికి భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.

 ఏదో పండగలకి పబ్బాలకి తప్ప మిగతా రోజుల్లో మానవ మాత్రుడు కూడా ఈ గుడిలో కనిపించరు. ఏదైనా భక్తీ మరియు ఊరేగింపు కార్య క్రమాలు చెయ్యాలన్నా పట్టించుకునే తీరికే లేదట ధర్మ కర్తలకి.పోనీ గుడికి ఆస్తులు లేవా అంటే అదీ కాదు.మన గ్రామం లో ఉన్న అందరి దేవుళ్ళ మాన్యం కంటే విశ్వేశ్వరాలయానికే అత్యధికం గా 17 ఎకరాల పొలం ఉంది.ఇక ఇదే గుడిలో ఉన్న అన్నపూర్ణంబాలయం గురించి అసలు ఊర్లో వాళ్ళకే సగం మందికి తెలీదు.ఇది అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం.కనీసం గుడిలో ఎక్కడా మచ్చుకైన ఈ పేరు తో ఒక ఫలకం కనిపించదు.మహిళల అర్చకత్వం ఈ గుడి గురించి చెప్పుకోదగ్గ అరుదైన విషయం.ఎన్ని అవాంతరాలు ఎదురైనా గుడిని ఇంత సమర్ధం గా నిర్వహిస్తున్న విజయమ్మ మరియు వారి సోదరిమణులను అభినందించి తీరాల్సిందే.

ఇటివలే మన గ్రామం నుంచి వెళ్లి విజయవాడ లో స్థిరపడ్డ ఓ కుటుంబం చొరవ తో ఇటివల కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు.ఇప్పటికైనా ధర్మకర్తలు పూనుకొని గుడికి ఉన్న ఆదాయ వనరుల్ని సక్రమంగా ఉపయోగిస్తే జలధీశ్వరాలయానికి సమానం గా ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెంది మరింతగా పర్యాటకులని ఆకర్షించటానికి తోడ్పడుతుంది.

Dated : 18.05.2011

This text will be replaced