రామయ్య కొట్టుBack to list

రామయ్య కొట్టు

 

నాలాగే చాలా మంది చిన్నపుడు అమ్మ ఇచ్చిన సరుకుల చీటీ, చేతి సంచి పట్టుకుని చాలా మంది వెళ్ళిన కిరాణ షాపు రామయ్య గారిదే. కొంచెం పాత తరం వాళ్ళకి అది గెల్లి పిచ్చియ్య గారి కొట్టు. అసలు ఆ సెంటర్ పేరే రామయ్య కొట్టు ,ఏ వీధికి వెళ్ళాలన్నా అదే లాండ్ మార్క్. రామయ్య కొట్టు నుంచి కుడి చేతి వైపుకో ఎడమ చేతి వైపుకో తిరగమని అడ్రస్ చెప్తారు.భారతీయ వర్ణ వ్యవస్థ లో  ఉన్న చతుర్వర్ణాలలో వైశ్యులు మూడవ వర్ణం.తెలుగు నాట వైశ్యులు చారిత్రకముగా పూర్వ మధ్య యుగము, మధ్యయుగము వరకు జైనులు. గోమఠ మతానుయాయులు కావున వీరికి కోమటి అను పెరు వచ్చింది. వీరి వలె ఉత్తర భారతమందు జైనులు వాణిజ్య వృత్తిలో ప్రముఖులు. మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921 మరియు 1931 మధ్య కాలంలో ఒక కమీషన్ వేసాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి తమ పేరును కోమటి నుండి ఆర్యవైశ్య గా మార్చుకున్నారు. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం.అసలు వైశ్యుడంటే ఏమిటో నా మిత్రుడు ఒక భాష్యం చెప్పాడు.ప్రజలు సిరి సంపదల తో తుల తూగినా,కరువు కాటకాలతో బాధపడుతున్నా,వస్తువు కొరత తో దానికి ఎంత డిమాండ్ ఉన్నా,ఎల్లపుడూ సరైన ధరకే అమ్మేవాడు  వైశ్యుడు అని.మన ఊరు ఒకప్పుడు వైశ్యుల ప్రాముఖ్య త కలిగిన పట్టణమే ,వీరి వైభవం ఎన్నతగినది.అన్ని సామాజిక వర్గాలని వరుస పెట్టి మామయ్య ,బాబాయి అని పిలిచే సంస్కారం వారి సొంతం.రామయ్య గారు కిరాణా కొట్టు ఎప్పటినుంచి ఉందొ తెలిదు కానీ,అందరికీ ఆ కొట్టంటే అదో నమ్మకం,అక్కడ అమ్మే సరుకంటే నాణ్యత కి మారు పేరు.తరాలు మారినా వారి వారసులు మాత్రం ఆ షాపు వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.గ్రామం లో  బహుశా ఆ కొట్టుకి వెళ్లి కొనని వారు లేరేమో.నాకు తెలిసినప్పట్నుంచి మిగతా సామాజిక వర్గాల వారు డిపార్ట్ మెంట్ స్టోర్స్ పేరుతో కిరాణ షాపులు పెట్టి చేతులు కాల్చుకున్నారు తప్ప రామయ్య కొట్టు కి ఏ మాత్రం గట్టి పోటీని మాత్రం ఇవ్వలేకపోయారు.అందుకే వర్ణాశ్రమం లో సాత్విక ధర్మాలు అధమ స్థాయిలో కలిగి ఉన్నా  వైశ్యులను "వర్తక నిర్మాణిక వర్గం" నందు వుంచారు.అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా..రామయ్య కొట్టే నెంబర్ ఒన్.

Dated : 25.09.2011

This text will be replaced