





గొర్రెపాటి వారు కమ్మవారు ,గడచిన 200 ఏళ్ళు గా ఆంధ్ర దేశమున పేరెన్నిక గన్నది వంశము.ఘంటసాల గ్రామ రాజకీయాల్లో ,అభివృద్ధి లో వీరి పాత్ర అభినందనీయము. 1970 వ దశకము లో శ్రీ గొర్రెపాటి వెంకట నరసయ్య గారు ఈ గ్రంధాన్ని రచించారు.తదనంతరం శ్రీ గొర్రెపాటి రవి సుధాకర్ 2011 లో ఈ -బుక్ రూపం లో అనువదించి భద్ర పరచుట జరిగినది.
. ...readmoreతన జీవితం లో చేస్తూ వచ్చినట్లే తన జీవిత చరిత్ర రచన లో సైతం ఆ మంచిని చూడటానికే ప్రయత్నించారు అని నార్ల వెంకటేశ్వరరావు గారు కించిత్తు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ,ఎవరి మీద ఒక్క ఆరోపణ కూడా లేకుండా తన జీవిత చరిత్ర ని రాసుకున్న వ్యక్తిగా గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు చరిత్ర లో నిలిచిపోతారు.1898 నుంచి 1984 వరకు 86 ఏళ్ళు బ్రతికి ,అందులో ఎక్కువ భాగం క్రియా శీల రాజకీయాల్లో తల మునకలు గా బ్రతికిన వ్యక్తికి సహజం గానే పరిచయాలు మెండు. వాళ్ళందరి గురించి తనకు తెల్సిన మంచి విషయాలు మాత్రమే రాయటం బహుశా ఆయనకొక్కరికే సాధ్యమైన పనేమో.
. ...readmore
ఘంటసాల చరిత్ర మొట్టమొదటి సారిగా 1947 లో ముద్రించబడింది.చరిత్ర కారుడు శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఆనాడే దూర దృష్టి తో భావితరాలకు చరిత్ర ని అందించాలనే ధృడ సంకల్పంతో ఎన్నో వ్య య ప్రయాసల కోర్చి ఈ గ్రంధాన్ని రచించారు.ఇప్పటికీ గ్రామ చరిత్ర తెలుసు కోవటానికి మిగిలిన ఏకైక ఆధారం ఈ గ్రంధం ఒక్కటే.తదనంతరం 1966 లో ఈ ద్వితీయ భాగం మరింత విపులం గా రచించారు.ఆ పుస్తకాన్ని మళ్లీ నేటి ఆధునిక పరిజ్ఞానం తో ఈ - బుక్ రూపం లో భద్రపరచటం జరిగింది.అంతే కాకుండా రెండు భాగాలని కలిపి ఒకే పుస్తకం గా 2011 లో రచయిత కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం తో పునర్ ముద్రించారు.కాపిలకై మాకు మెయిల్ చేయండి.
. ...readmoreఘంటసాల చరిత్ర మొట్టమొదటి సారిగా 1947 లో ముద్రించబడింది. చరిత్ర కారుడు శ్రీ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఆనాడే దూర దృష్టి తో భావితరాలకు చరిత్ర ని అందించాలనే ధృడ సంకల్పంతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ గ్రంధాన్ని రచించారు.ఇప్పటికీ గ్రామ చరిత్ర తెలుసు కోవటానికి మిగిలిన ఏకైక ఆధారం ఈ గ్రంధం ఒక్కటే.తదనంతరం 1966 లో ద్వితీయ భాగం రచించారు.కానీ 1947 నాటి పుస్తకం భౌతికం గా ఒకే ఒక్క కాపీ మాత్రమే ఇపుడు ఉంది.ఆ పుస్తకాన్ని మళ్లీ నేటి ఆధునిక పరిజ్ఞానం తో ఈ - బుక్ రూపం లో భద్రపరచటం జరిగింది.అంతే కాకుండా రెండు భాగాలని కలిపి ఒకే పుస్తకం గా 2011 లో రచయిత కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం తో పునర్ ముద్రించారు.కాపిలకై మాకు మెయిల్ చేయండి.
. ...readmore