Latest News

  • తుమ్మల వేణుగోపాల రావు అస్తమయం

     ప్రముఖ ఇంజనీర్ మరియు విద్యావేత్త అయిన తుమ్మల వేణుగోపాల రావు ఈ రోజు విశాఖపట్నం లో దివంగతులయ్యారు.ఈయన స్వస్థలం ఘంటసాల పాలెం.అయన సతీమణి కృష్ణాబాయిది కూడా ఘంటసాల పాలెం గ్రామమే.విజయవాడ లో సిద్ధార్ధ కాలేజి రూపకర్త ఈయనే.అప్పట్లో నే complaint Box విధానాన్ని కళాశాలలో ప్రవేశ పెట్టి విధ్యార్దుల ఫిర్యాదులను, సలహాలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయటం ద్వారా విద్యా విధానం లో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.ఇందిరా గాంధి ఎమర్జెన్సి ప్రకటించిన సమయం లో రాడికల్స్ పార్టీ నేత గా జైలు జీవితాన్ని అనుభవించారు.

    . ...readmore

  • జగన్ ఓదార్పు యాత్ర

     ఓదార్పు యాత్ర లో భాగం గా ఈ నెల 23 న Y.S.R కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఘంటసాల రానున్నారు.

    C.B.I తనిఖిలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణం లో జగన్ మన గ్రామానికి ఓదార్పు యాత్ర కి రావటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.రామయ్య కొట్టు సెంటర్ లో ప్రసంగించిన అనంతరం ఆ రాత్రికి దేవరకోట లో బస చేస్తారు.
    సరిగ్గా ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తన జన్మ స్థలమైన దేవరకోట విచ్చేసి తమ పూర్వీకులను కలుసుకున్నారు.ఆంధ్రజ్యోతి పేరు వింటేనే నిప్పులా ఎగసిపడే జగన్ ఇప్పుడు అదే రాధా కృష్ణ జన్మ స్థలమైన దేవరకోట లోనే బస చేయటం కొసమెరుపు.
    . ...readmore

  • నవగ్రహ మండప నిర్మాణం

     లధీశ్వరాలయ ప్రాంగణం లో నల్ల రాతితో నిర్మించబడిన నవ గ్రహ మండప నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్సింది.దేవాలయానికి ఉన్న పురాతన ప్రశస్తి దృష్ట్యా పూర్తి గా రాతితోనే నిర్మాణాన్ని గావించారు.మరో విశేషం ఏమిటంటే అన్నీ దేవాలయాల్లో నూ గ్రహధిపతుల ప్రతిమలు మాత్రమే ఉంటాయి .కానీ ఈ మండపం లో గ్రహాధిపతుల ప్రతిమల తో పాటు ,వారి భార్యల ప్రతిమల్ని కూడా ప్రతిష్టించటం.

    . ...readmore

  • పది పడకల ఆసుపత్రి

    మన గ్రామం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది.ఘంటసాల పాలెం ఆసుపత్రి తరహలోనే ఇక In-Patient విభాగం కూడా అందుబాటులో ఉంటుంది.ప్రస్తుతం పంచాయితీ పక్కన ఘంటసాల కళా తోరణం ఎదురుగా ఉన్న స్థలం లో నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు.దాదాపు 40 లక్షల అంచనా వ్యయం తో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు.ఇక ఇన్ని రోజులనుంచి out patient సేవలకి మాత్రమె అందుబాటు లో ఉన్న ప్రస్తుత ఆసుపత్రి ఇందులో విలీనం కానుంది.

    . ...readmore

  • పంచాయితీ సంత మార్కెట్ ప్రారంభం

      గ్రామ శివారు లో స్మశాన వాటిక ఎదురుగా అత్యంత విశాల మైన ప్రదేశం లో గ్రామ పంచాయితీ సంత మార్కెట్ ని మన  MLA అంబటి బ్రాహ్మణయ్య  ఆగస్ట్ 14, 2011  న ప్రారంభించారు.ప్రస్తుతం సత్రం సెంటర్ లో ఉన్న కూరగాయల దుకాణాలు మరియు తోపుడు బండ్లు ట్రాఫిక్ కి అంతరాయాన్ని కలిగిస్తుండటం,మరియు కూరగాయల వ్యర్ధాలు రోడ్డ్డు మీదే పారేస్తుండటం తో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది.వీటిని నివారించటానికి మన సర్పంచ్ అందె జగదీష్ ఈ సంత మార్కెట్ నిర్మాణానికి పూనుకొన్నారు.దీని ద్వారా ప్రజారోగ్యం తో పాటు కొనుగోలు దారులకు కూడా సౌకర్యం గా ఉంటుందని ఆయన తెలిపారు.

    . ...readmore

  • హేతువాద ఉద్యమ నాయకుడు

    . ...readmore

  • పత్రికా కధనాలు

    . ...readmore

  • ఘంటసాల చరిత్ర-గ్రంధావిష్కరణ విశేషాలు

    ఘంటసాల న్యూస్ ఆగష్టు ౧౫-౨౦౧౧ : ఘంటసాల చరిత్ర తృతీయ ముద్రణ పుస్తకావిష్కరణ నూతనం గా నిర్మించిన గొర్రెపాటి రంగన్న,వేమూరి రామన్న కళా మందిరం లో వేడుక గా జరిగింది. గతం లో ఉన్న పాత మండపాన్ని కూల్చివేసి ఆ స్థానం లో నే నూతన వేదిక ని నిర్మించారు.పాత వేదిక పై జరిగిన ఆఖరి కార్యక్రమం వెబ్ సైట్ ఆవిష్కరణ కాగా ,నూతన వేదిక పై జరిగిన మొదటి వేడుక కూడా వెబ్ సైట్ కే సంబంధించిన కార్యక్రమం కావటం విశేషం

    . ...readmore