ఘంటసాల చరిత్ర-గ్రంధావిష్కరణ విశేషాలుBack to list

 

ముఖ చిత్రం

ఘంటసాల న్యూస్ ఆగష్టు ౧౫-౨౦౧౧ : ఘంటసాల చరిత్ర తృతీయ ముద్రణ పుస్తకావిష్కరణ నూతనం గా నిర్మించిన గొర్రెపాటి రంగన్న,వేమూరి రామన్న కళా మందిరం లో వేడుక గా జరిగింది. గతం లో ఉన్న పాత మండపాన్ని కూల్చివేసి ఆ స్థానం లో నే నూతన వేదిక ని నిర్మించారు.పాత వేదిక పై జరిగిన ఆఖరి కార్యక్రమం వెబ్ సైట్ ఆవిష్కరణ కాగా ,నూతన వేదిక పై జరిగిన మొదటి వేడుక కూడా వెబ్ సైట్ కే సంబంధించిన కార్యక్రమం కావటం విశేషం.శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతి ని గొర్రెపాటి వెంకట నరసింహారావు గారికి అందించారు.ఎన్నో సంవత్సరాల తర్వాత పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి వారసులు గ్రామానికి విచ్చేసి కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణ గా నిలిచారు.అంతే కాక పుస్తక ముద్రణ కి అవసరమైన ఆర్ధిక సహాయాన్ని కూడా అందించారు.ఇన్నేళ్ళ తర్వాత తమ తాత ని  ఈ సందర్భం గా గౌరవించటం  ఎంతో  ఆనందం గా ఉందన్నారు.ఘంటసాల గ్రామం ఉన్నంత వరకు వెంకట సుబ్బయ్య నిలిచిపోతారని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు.ఎన్నో కేసులకి ,తేదిలకి ఈ గ్రంధం ప్రామాణికం గా నిలిచిందని కొన్ని ఉదంతాలను గొర్రెపాటి లీలక్రిష్ణయ్య ప్రస్తావించారు.ముత్యాలమ్మ తోట హక్కుల విషయం లో అప్పటి జడ్జి ఈ గ్రంధం ఆధారం గా నే తీర్పు నిచ్చారని శ్రీ వేమూరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఇలా ఎంతో మందికి ఆధారమైన ఈ గ్రంధం కనుమరుగైన దశ లో దీనికి పునరుజ్జివాన్ని కల్పించిన వెంకట సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులకి ,వెంకట నరసింహ రావు గారిని,అలాగే రెండు సంవత్సరాలుగా ఈ చరిత్ర పరిరక్షనోద్యమాన్ని కొనసాగిస్తున్న వెబ్ సైట్ ని అభినందనలతో ముంచెత్తారు.శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ కార్యక్రమ ఏర్పాట్లను ఘనం గా నిర్వహించారు. సభ కి అధ్యక్షత వహించిన శ్రీ వేమూరి విశ్వేశ్వరరావు ఆనాటి విశేషాలను సమగ్రం గా ప్రేక్షకుల కు కళ్ళకు కట్టినట్లు వివరించారు.ఇంకా ఈ కార్య క్రమం లో అయినపూడి విజయ కుమార్,గొర్రెపాటి చంద్ర శేఖర రావు ,పలువురు అతిధులు హాజరై తమ అభినందనలు తెలిపారు.
ఘంటసాల చరిత్ర గ్రంధావిష్కరణ పై పలు పత్రికలు కధనాలు వెలువరించాయి.
మరిన్ని చిత్రాలకై చూడండి.

picasaweb.google.com/106497386570145999782/GhantasalaCharitraBookLaunch15082011#