హేతువాద ఉద్యమ నాయకుడు Back to list

 ఘంటసాల న్యూస్ ౧౭,౨౦౧౧ : ప్రముఖ హేతువాద ఉద్యమ నాయకుడు ,రచయిత శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి జీవిత విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఈ రోజు వర్లు విద్యా కేంద్రం లో ప్రముఖ రచయిత ,దక్షిణ భారత హిందీ ప్రచార సభ అధ్యక్షుడు శ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరించారు.స్వాతి పత్రిక అధినేత శ్రీ వేమూరి బలరాం,శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమానికి సభా సామ్రాట్ శ్రీ వేమూరి విశ్వేశ్వర రావు అధ్యక్షత వహించారు.హేతువాద ఉద్యమాన్ని ప్రజల్లో కి తీసుకెళ్ళి మూఢ నమ్మకాల్ని బాపి,చైతన్య స్ఫూర్తి ని రగిల్చిన త్రిపురనేని జీవిత విశేషాలు అందరికీ అందాలనే సదుద్దేశం తో విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ గొర్రెపాటి నరసింహ రావు ఈ గ్రంధాన్ని ప్రచురించారు.తమలో ఈ స్పూర్తి ని రగిల్చి త్రిపురనేని భావాలని తమలో నింపిన గురు తుల్యుడు శ్రీ వేమూరి వెంకట్రామయ్య (ఆఫీసు) కి ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు.మాజీ జెడ్ పి వైస్ చైర్మన్ శ్రీ గొర్రెపాటి వెంకట రామ కృష్ణ ,వేమూరి వెంకట రామ కృష్ణ ప్రసాద్ ,ఇంకా పలువురు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.