నవగ్రహ మండప నిర్మాణం Back to list

నవగ్రహ మండప నిర్మాణం 

 

 జలధీశ్వరాలయ ప్రాంగణం లో నల్ల రాతితో నిర్మించబడిన నవ గ్రహ మండప నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్సింది.దేవాలయానికి ఉన్న పురాతన ప్రశస్తి దృష్ట్యా పూర్తి గా రాతితోనే నిర్మాణాన్ని గావించారు.మరో విశేషం ఏమిటంటే అన్నీ దేవాలయాల్లో నూ గ్రహధిపతుల ప్రతిమలు మాత్రమే ఉంటాయి .కానీ ఈ మండపం లో గ్రహాధిపతుల ప్రతిమల తో పాటు ,వారి భార్యల ప్రతిమల్ని కూడా ప్రతిష్టించటం. మంగళగిరి కి చెందిన  స్థపతి కుంచాల ప్రకాష్  ఈ నిర్మాణాన్ని రూపొందించారు.దాదాపు 7 లక్షల రూపాయల వ్యయం తో నిర్మించబడ్డ ఈ మండపానికి స్వాతి పత్రిక అధినేత వేమూరి బలరాం విరాళాన్ని అందించారు. నవంబరు మొదటి వారం లో మండప ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తునట్లు సమగ్ర దేవాలయ పునర్వైభవ నిర్మాణ సారధి గొర్రెపాటి వెంకట రామకృష్ణ తెలిపారు.