కొలువు దీరిన కొత్త పాలక వర్గంBack to list

కొలువు దీరిన కొత్త పాలక వర్గం 

ఘంటసాల గ్రామ పంచాయితీ 15 వ సర్పంచ్ గా టి డి పి బలపరచిన అభ్యర్ధి శ్రీమతి కౌతరపు నాగరత్నం గెలుపొందారు. మరో 5 సంవత్సరాల్లో వందేళ్ళకి చేరువవుతున్న మన గ్రామ పంచాయితీ కి అధ్యక్షత వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. సర్పంచ్ ఎన్నికతో పాటు గ్రామంలో ఉన్న 14 వార్డుల్లో 11 వార్డులు టి డి పి బలపరచిన అభ్యర్ధులే గెలవటం విశేషం. ఇక ఉప సర్పంచ్ గా 7 వ వార్డు నుండి గెలిచిన గొర్రెపాటి సురేష్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్ధులందరికీ మన ఘంటసాల నెట్ తరపున శుభాకాంక్షలు

 

Dated : 31.07.2013