గొట్టిపాటి బ్రహ్మయ్య గారి 29 వ వర్ధంతిBack to list

 ఈరోజు గొట్టిపాటి బ్రహ్మయ్య గారి 29 వ వర్ధంతి


 
నేటికి గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు అస్తమించి 29 ఏళ్ళు. 1984 జులై 19 న విజయవాడ లో పరమపదించారు. మన రాష్ట్రానికి తొలి శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి మన గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు.  రాష్ట్ర కాంగ్రెస్ కి అధ్యక్షుడుగా పనిచేశారు. జాతీయోద్యమం లో బ్రిటిష్ వాళ్ళకి నల్ల జెండాలు చూపించి అరెస్ట్ అయ్యారు. ఆయన సేవలకి గుర్తుగా  బందరులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి ఆయన పేరే పెట్టారు. మహాత్మా గాంధీని మన గ్రామానికి తీసుకువచ్చి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి మన బ్రహ్మ్మయ్య గారు. అలాంటి వ్యక్తి స్థూపం లో ఫోటో మాసిపోయి ఏళ్ళు గడుస్తున్న పట్టించుకోలేని స్థితి మనది. మరణించిన మహనీయులని వారి వారసులు ఉంటే తప్ప మామూలు జనం పట్టించుకోని స్థితికి మనం ఎప్పుడో చేరుకున్నాం. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ భూషణ్ ఇచ్చి గౌరవించింది. ఆత్మస్తుతి, పరనింద లేని ఏకైక ఆత్మ కధగా ప్రశంసలు పొందిన ఆయన ఆత్మకధ నా జీవన నౌక ఇక్కడ మీకోసం..
 
 

నా జీవన నౌక ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి
 
 


బ్రహ్మ్మయ్య గారి మరిన్ని ఫోటోల కోసం క్లిక్ చెయ్యండి 
 
 
 
Dated : 19.07.2013