పాలెం సర్పంచ్ అభ్యర్ధి శ్రీ వేమూరి సాయిBack to list

 పాలెం సర్పంచ్ అభ్యర్ధి శ్రీ వేమూరి సాయి

ఘంటసాల పాలెం పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధిగా శ్రీ వేమూరి సాయి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నారు. ఈరోజు వరకూ దాదాపు ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న సమయంలో శ్రీ చిర్ల భీమయ్య మరో అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చెయ్యటంతో పోటీ అనివార్యమైంది. మొత్తం 8 వార్దులున్న పాలెం పంచాయితీ లో 5 వార్డులు ఏకగ్రీవం కాగా మూడు వార్డులు మరియు సర్పంచ్ కి ఎన్నికలు జరగనున్నాయి. 1185 మంది వోటర్లు ఉన్న ఈ గ్రామంలో BC, SC ల వోట్లే గెలుపుకి కీలకం. గతంలో మూడు సార్లు సర్పంచ్ గా పని చేసిన వేమూరి వెంకట కృష్ణారావు గారు మూడు సార్లు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.

dated : 18.07.2013