పంచాయితీ ఎన్నికల హడావుడిBack to list

 
 
  
ఘంటసాల గ్రామ సర్పంచ్ పదవి ఈసారి BC మహిళకి కేటాయించారు. గతంలో సర్పంచ్ గా పని చేసిన అందె జగదీష్ సతీమణి ఒక అభ్యర్ధిగా ఘోటకం కి చెందిన కౌతరపు భాస్కరరావు సతీమణి మరొక అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇద్దరు అభ్యర్ధులు టి డి పి అభ్యర్ధులుగా పోటీ చేయటం విశేషం. ఇతర పార్టీలు ఏవీ ఇప్పటివరకు తమ అభ్యర్ధుల్ని ప్రకటించక పోగా వీరిద్దరికే మద్దతు పలకటం గమనార్హం. ఇక 7 వ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న గొర్రెపాటి సురేష్ ఉప సర్పంచ్ పదవి రేసు లో ఉన్నారు. మొత్తం 13 వార్డులున్న మన పంచాయితీలో మెజారిటీ సభ్యులు ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. సర్పంచ్ మాత్రం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా నేరుగా ఎన్నుకోబడతారు.

1918 లో ఏర్పడిన ఘంటసాల, ఘంటసాల పాలెం ఉమ్మడి పంచాయితీకి ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ లుగా పనిచేసారు. 1938లో ఘంటసాల వేరు పడ్డాక 12 మంది ఇప్పటివరకు ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు కాబోయే వ్యక్తి మన గ్రామానికి 14వ సర్పంచ్.
 
Dated : 13.07.2013
 
                             ఘంటసాల  సర్పంచ్  (ప్రెసిడెంట్ )గా పనిచేసినవారు                                 

.సంఖ్య

పేరు

 పనిచేసిన  కాలము

1.

శ్రీ అందె జగదీష్

22.08.2006 నుండి 2012 

2.

శ్రీమతి పాల మరియమ్మ

17.08.2001 నుండి 22.08.2006

3.

శ్రీ వేమూరి శివరామకృష్ణ (పండు బాబు)

21.10.1995  నుండి 16.08.2001

4.

శ్రీ సంకా నాగబాలసుబ్రమణ్యం

31.03.1988నుండి 20.10.1995

5.

శ్రీ వేమూరి నాంచారయ్య

29-05-1981 నుండి 30-03-1988

6.

శ్రీ బండి వెంకటలక్ష్మీనారాయణ

12-12-1974 నుండి 30-03-1976

7.

శ్రీ గొర్రెపాటి బుల్లెయ్య చౌదరి

01-07-1964 నుండి 24-09-1974

8.

శ్రీ దోనేపూడి సీతారామయ్య

10-09-1959 నుండి 01-06-1964

9.

శ్రీమతి గొర్రెపాటి మహాలక్ష్మమ్మ

31-05-1957 నుండి 29-08-1959

10.

శ్రీ తుమ్మల వెంకట్రామయ్య

09-02-1953 నుండి 04-04-1956

11.

శ్రీ వేమూరి గోపాలకృష్ణయ్య

04-12-1947 నుండి 09-02-1953

12.

శ్రీ గొర్రెపాటి వెంకట్రామయ్య

09-11-1938 నుండి 28-10-1947

13.

శ్రీ వేమూరి నాగయ్య

12-11-1934 నుండి 30-10-1936

14.

శ్రీ వేమూరి వెంకయ్య

18-04-1918 నుండి 11-11-1934