శరవేగంగా ముఖద్వార నిర్మాణం Back to list

దాదాపు రెండు సంవత్సరాల క్రితం శంఖు స్థాపన జరుపుకున్న శ్రీ కోట ముత్యాలమ్మ దేవస్థానం ముఖద్వార నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసపు సంబరాలకి ప్రారంభోత్సవం చెయ్యాలనే సంకల్పంతో ఆలయ ధర్మకర్తలైన వేమూరి రామకృష్ణ ప్రసాద్ ,వేమూరి సుబ్రమణశ్వరరావు గార్లు నిర్మాణ పనులని పర్యవేక్షిస్తున్నారు. 08. 05. 2011 న వేమూరి చిట్టిబాబు దంపతులు శంఖుస్థాపన చేసి తొలి విరాళం 5000/- రూపాయలని అందించారు.

ఈ నిర్మాణ ప్రతిపాదన తెచ్చిన వేమూరి రామచంద్రరావు (బంగారం) మరియు వేమూరి రామకృష్ణ ప్రసాద్ (షావుకారు) గార్లు రికార్డు స్థాయిలో నెల రోజుల్లోనే దాదాపు 2,60,000/- దాతలనుంచి సేకరించారు. పలువురు గ్రామస్థులు, ప్రవాసులు తమ వితరణ ని అందించారు. ప్రస్తుతం ఈ నిర్మాణం ఘంటసాల గ్రామం వైపు జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే దేవరకోట వైపు నుండి వచ్చే దారిలో కూడా ఇలాంటి నిర్మాణాన్ని చేపడతామని ధర్మకర్తలు తెలిపారు. రెండు గ్రామాలకి సరిహద్దులో ఈ దేవాలయం ఉన్నా, పంచాయితీ పరిధి మాత్రం దేవరకోట లోనే ఉంది.


ఈ ఆలయ విశేషాలకి ఇక్కడ క్లిక్ చెయ్యండి
 
Dated : 07.07.2013