శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు అస్తమయం
ప్రముఖ రాజకీయ వేత్త, విద్యాధికులు, ఘంటసాల పాలెం గ్రామ ప్రముఖులు, శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారు 15.04.2012 న గ్రామంలో తమ స్వగృహం లో తుది శ్వాస విడిచారు. అయన వయసు 84 సంవత్సరాలు.1929 వ సంవత్సరంలో శ్రీ వేమూరి వెంకయ్య గారి సంతానంగా జన్మించారు. ఘంటసాల పాలెం గ్రామ పంచాయితీ ఏర్పడినప్పుడు తొలి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఘంటసాల మండలం ఏర్పాటు అయినప్పుడు తోలి మండల వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ఆయన హయం లోనే మంచినీటి టాంక్ ని నిర్మించి ప్రజల తాగునీటి అవసరాలని తీర్చారు. వీరి అక్క గారు శ్రీ గొర్రెపాటి మహాలక్ష్మమ్మ స్త్రీవాద రచయిత్రి, ఘంటసాల గ్రామానికి చెందిన గొర్రెపాటి బాపనయ్య గారి సతీమణి. వీరి మేనమామ దేవరకోటకి చెందిన దోనేపూడి వెంకటేశ్వర్లు గారు. వీరు ముగ్గురూ మూడు గ్రామాలకి ఒకే సమయం లో సర్పంచ్ లు గా పని చేయటం విశేషం. వెంకట కృష్ణారావు గారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. భార్య సీతారావమ్మ కొద్ది సంవత్సరాల క్రితమే కాలం చేశారు. కొద్ది కాలం క్రితం పెద్దకుమారుడు దామోదరరావు కూడా దివంగతులయ్యారు.