గొర్రెపాటి వెంకట్రాయులు గారు
వెంకట్రాయులు గారి మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు గ్రామస్తులు, హైదరాబాదులో ఉన్న వారి బంధువులంతా లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన కుమారులు నలుగురు మరియు కుమార్తె కూడా అమెరికాలోనే ఉండటంతో వారు వచ్చేవరకు ఆసుపత్రి లోనే ఆయన భౌతిక కాయాన్ని భద్రపరిచారు. గురువారం వారి కుమారులు హైదరాబాదు చేరుకోగానే శుక్రవారం ( 10.02.2012) హైదరాబాదులోని బంధువులు స్నేహితుల సందర్శనార్ధం భౌతిక కాయాన్ని జూబ్లి హిల్స్ లో ఆయన స్వగృహంలో ఉంచుతారు. శనివారం(11.02.2012) అంత్యక్రియలు ఘంటసాలలో జరుగుతాయి.
Dated : 08.02.2011