గొర్రెపాటి వెంకట్రాయులు విద్యా ట్రస్ట్ అధినేత శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు గారు కొద్ది సేపటి క్రితం దివంగతులయ్యారు.ఆయన వయసు 90 సంవత్సరాలు.పొద్దున్న ఒంట్లో నలత గా ఉండటం తో చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాదు లో గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.పరిస్తితి విషమించటం తో రాత్రి 10.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.విషయం తెలుసుకున్న వెంటనే పెద్ద కుమారుడు శ్రీ రంగనాధ బాబు గారు హుటా హుటిన అమెరికా నుంచి బయలుదేరారు.గురువారం ఉదయానికి ఆయన హైదరాబాదు చేరుకునే వరకు ఆయన భౌతిక కాయాన్ని భద్రపరిచారు.మిగతా ముగ్గురు కుమారులు కూడా గురువారానికే ఇక్కడికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
Dated : 06.02.2012