జలధీశ్వరస్వామిని దర్శించుకున్న గల్లా Back to list

 జలధీశ్వరస్వామిని దర్శించుకున్న గల్లా రామచంద్రనాయుడు 

అమరరాజా బ్యాటరీస్ అధినేత శ్రీ గల్లా రామచంద్రనాయుడు మన గ్రామానికి విచ్చేశారు. చిరకాల మిత్రుడు అయిన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు ఆయనను వెంటబెట్టుకుని తీసుకురాగా ఆలయంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. 21.01.2012 శని త్రయోదశి కావటంతో అప్పటికే పూజలు జరిపించుకుంటున్న భక్తులతో పాటుగా, అయన కూడా ప్రత్యేక పూజలు జరిపించారు. తదనంతరం బౌద్ధ స్తూపం, మ్యూజియంను దర్శించి స్థానిక వర్లు విద్యా కేంద్రంలో జరిగిన గ్రామస్తుల సమావేశంలో ప్రసంగించారు.తదనంతరం చల్లపల్లి విజయా కాన్వెంట్ వార్షికోత్సవానికి హాజరై ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ చారిత్రకం గా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాన్ని దర్శించటం చాల ఆనందం గా ఉందని తెలిపారు. ఆయన వెంట శ్రీ గొర్రెపాటి చంద్రశేఖరరావు, శ్రీ గొర్రెపాటి లీలక్రిష్ణయ్య,  శ్రీ వేమూరి విశ్వేశ్వరరావు. కొండపల్లి రామకృష్ణ ,మరియు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ  గొర్రెపాటి వెంకట రామకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 

 

 Dated : 22.01.2012