మూల్పూరి దంపతులకు సన్మానం
ప్రవాసాంధ్రుడు ప్రముఖ విద్యా వేత్త శ్రీ మూల్పూరి వెంకట్రావు గారి దంపతులకు ఈ రోజు జలదీశ్వరాలయ కమిటీ తరపున ఘన సన్మానం చేశారు.విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు India International Friendship Society ప్రతి సంవత్సరం GLORY OF INDIA అవార్డు ని అందిస్తుంది.ఈ సంవత్సరం ఈ అవార్డ్ ని శ్రీ మూల్పూరి వెంకట్రావు గారికి జనవరి 11న ప్రవాసి భారతీయ దివస్ సందర్భం గా కేంద్రమంత్రి శ్రీ పవన్ కుమార్ భన్సాల్ చేతుల మీదుగా అందించనున్నారు. ఘంటసాల గ్రామ ప్రాంత వ్యక్తి కి ఈ అవార్డ్ రావటం మన ప్రాంతానికే గర్వకారణం అని గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.అంతే కాకుండా జలదీశ్వ రాలయ అభివృద్ధిలో వెంకట్రావు గారు విశేషమైన ఆర్ధిక సహకారాన్ని అందించారు. ఇందుకు గాను ఆలయ కమిటీ తమ కృతజ్ఞతలు తెలియచేసింది.
Dated : 19.12.2011